సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఏఆర్ మురుగదాస్.  ఆయన తీసిన సినిమాలు ఒకటీ రెండు తప్పా దాదాపు అన్ని సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  మురుగదాస్ సినిమాల్లో మరో ప్రత్యేకత ఏంటంటే సమాజానికి పనికి వచ్చే మంచి మెసేజ్ ఉంటుంది.  గత ఏడాది స్టార్ హీరో విజయ్ తో తెరకెక్కించిన ‘సర్కార్ ’ మూవీలో ఓటు విలువ ఏంటో తెలియజెప్పే విధంగా ఉంది.  ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్భార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ మూవీ తమిళనాట మంచి టాక్ వచ్చిందని.. 150 కోట్ల క్లబ్ లో చేరిందని తెగ వార్తలు వచ్చాయి. కానీ,  ‘దర్బార్‌’ సినిమా వల్ల తాము కోట్లాది రూపాయలు నష్టపోయామని పంపిణీదారులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే.  

 

ఈ క్రమంలో సినిమాతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.  గతంలో లింగ సినిమాకు నష్టం వస్తే ఇదే తరహాలో పెద్ద ఎత్తున గొడవ చేశారు పంపిణీదారులు.  తాజాగా తాము రజినీకాంత్ గృహానికి వెళ్తే అక్కడ పోలీసులతో తమను బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు పంపిణీదారులు తెలిపారు.  

 

ఇదిలా ఉంటే ఇప్పుడు దర్శకులు మురుగదాస్  మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించి సినిమా పంపిణీదారుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. మరోవైపు, పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన దర్బార్‌ సినిమా రూ. 250 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ పంపిణీ దారులకు నష్టాలు వచ్చాయి. దీనిపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: