తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో ఫ్యామిలీ హీరోగా మెప్పించారు జగపతిబాబు.  గతంలో నటభూషన్ శోభన్ బాబు తరహాలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా జగపతిబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.  ఆ తరహా సినిమాల్లో ఎక్కువ రావడంతో తర్వాత ఆయనకు సినిమా ఛాన్సులు చాలా వరకు తగ్గాయి.  కెరీర్ పీకల్లోతుల్లో మునిగిపోతున్న సమయంలో బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించి ‘లెజెండ్ చిత్రంలో విలన్ పాత్రలో నటించారు జగపతిబాబు.  ‘లెజెండ్’ చిత్రం ఆయన కెరీర్ ని మరోమలుపు తిప్పింది.   అప్పటి నుంచి జగపతిబాబు కి వరుసగా విలన్ వేషాలు రావడం మొదలయ్యాయి. 

 

తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుసగా నటిస్తూ వస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ లో సైతం జగపతిబాబు మెప్పించారు. మొత్తానికి  న్యూ ఇన్నింగ్స్ లో చాలా జోరు మీదున్న జగపతి బాబు అదే జోష్ తో బుల్లి తెరపై కనిపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. గతంలోనే జగపతిబాబు బుల్లి తెరపై కనిపించాడు.  కానీ అప్పట్లో ఆయనకు ఈస్థాయిలో క్రేజ్ రాలేదు. తాజాగా ఇప్పుడు జగపతిబాబు కి ఫాలోయింగ్ బాగా పెరిగిపోవడంతో..  ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ డిజైన్ చేసిన ఒక టాక్ షోను జగపతి బాబు హోస్ట్ చేయబోతున్నాడు. ఆ షోకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ అయితే రాలేదు. 

 

ఇప్పటి వరకు వచ్చిన టాక్ షోలకు.. ప్రస్తుతం వస్తున్న టాక్ షోలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.  ప్రస్తుతం జగపతిబాబు ఎక్కడ చిన్న ఛాన్స్ ఉన్నా కూడా వదులుకోకుండా అన్నింట్లో కూడా తన సత్తా చాటేందుకు  జగపతిబాబు  ప్రయత్నం చేస్తున్నాడు. మరి బుల్లి తెర పై ఆయన ప్రస్థానం ఎలా సాగబోతుందనేది చూడాలి. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు పుణ్యమా అని నాగార్జున, చిరంజీవి బుల్లితెరపై కనువిందు చేశారు. బిగ్ బాస్ పుణ్యమా అని ఎన్టీఆర్, నానీ, నాగార్జున ఆడియన్స్ ని ఉర్రూతలూగించారు. ఇప్పుడు జగపతిబాబు ఏ రేంజ్ లో ఊపుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: