ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా మరో హీరోకు కలిసొచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సినిమాకు రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఈ లోగా.. ట్రిపుల్ ఆర్ పోస్ట్ పోన్ కావడంతో.. జులై 30న ఓ హీరో కర్చీఫ్ వేసేశాడు. 

 

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ మూవీ ట్రిపుల్ ఆర్ మొదలైందో లేదో.. జులై 30న రిలీజ్ అంటూ.. ఎనౌన్స్ చేశారు. షూటింగ్ లేటవడంతో.. విడుదల వాయిదా పడింది. ట్రిపుల్ ఆర్ దసరాకు వస్తుందో.. 2021 సంక్రాంతికి వస్తుందో తెలియదు. వాయిదా పడినట్టు చిత్ర వర్గాలు బయటకు చెప్పకపోయినా.. పోస్ట్ పోన్ గ్యారెంటీ. 

 

ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. బాహుబలి సిరీస్ మాదిరి సౌత్ ఇండియాలోని అన్ని లాంగ్వేజస్ తో పాటు.. హిందీలో రిలీజ్ అవుతోంది. ఒకేసారి రిలీజ్ అంటే.. అన్ని భాషల్లో పోటీ లేకుండా చూసుకోవాలి. ట్రిపుల్ ఆర్ మిస్ అయిన జులై 30వ తేదీని మరోసారి పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 2 యూజ్ చేసుకుంటోంది.

 

కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎప్ ఇండియా వైడ్ రిలీజై సూపర్ హిట్ అయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీకి సీక్వెల్ తీస్తున్నాడు. ఏడాది నుంచి సెట్స్ పై ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేద్దామనుకున్నారు. అయితే షూటింగ్ లేటవడం.. ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు సరైన డేట్ లేక సతమతమవుతున్ సమయంలో.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కావాల్సిన జులై 30న కేజీఎఫ్ 2 థియేటర్స్ లోకి రానుంది.        మొత్తానికి ట్రిపుల్ ఆర్ వాయిదా.. కేజీఎఫ్ కు కలిసొచ్చింది. ఇంకేముందీ ఫుల్ హ్యాపీగా ఉంది ఆ మూవీ టీం. తమకు పోటీగా ఏ సినిమా లేకపోవడంతో ఊపిరిపీల్చుకుంది. కలెక్షన్ల వర్షం తమకే అనే ధీమాలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: