రాజమౌళి దర్శకత్వం వహించిన రాంచరణ్ , జూ . ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్  ఆర్ ఆర్ కు సంబంధించిన కీలక అప్ డేట్ బుధవారం వచ్చిన విషయం తెలిసిందే.. ఈ సినిమాను జులైలో విడుదల చేస్తారని అభిమానులు అందరూ అనుకున్నారు. కానీ షూటింగ్ లో జరిగిన జాప్యం వల్ల రిలీజ్ వాయిదా వేయక తప్పడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది. కొత్త డేట్ గా జనవరి 8, 2021 అని తెలిపింది. కాబట్టి ఈ చిత్రం సంక్రాంతికి రాబోతోందని తేలింది.

 

రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా సంక్రాంతికి వస్తుండడంతో సంక్రాంతి సీజన్ పై ఆశలు పెట్టుకున్న టాప్ హీరోలు కూడా తమ సినిమాను రీ షెడ్యూల్ చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే నిన్న సాయంత్రం నుండి తమిళ మీడియాలో ఒక వార్త ఇక్కడి ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. అదే శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఇండియన్ 2 సంక్రాంతి కానుకగా జనవరి 14, 2021న విడుదల అవుతుందని అక్కడి మీడియా ప్రచారం చేస్తోంది.

 

ఇదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద రసవత్తర పోరు ఖాయం. ఎందుకంటే శంకర్, రాజమౌళి ఇద్దరూ భారతదేశం గర్వించదగ్గ దర్శకులు. ఇప్పటికే తమ సినిమాలతో వారు తమ తమ స్టామినాలను నిరూపించుకున్నారు. కాబట్టి ఈ అగ్ర దర్శకులు ఇద్దరూ పోటీ పడితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరమే కదా.

 

శంకర్ గత కొన్ని చిత్రాలు బాగా డౌన్ అయి ఉన్నాడు. ఐ, 2.0 చిత్రాలు బడ్జెట్ ను రికవర్ చేయడంలో విఫలమయ్యాయి. తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం శంకర్ కు ఏర్పడింది. కాబట్టి ఇండియన్2 ద్వారా మళ్ళీ తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యాడు. కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఇంతకీ ఆర్.ఆర్.ఆర్, ఇండియన్ 2 సినిమాల క్లాష్ నిజమేనా లేక ఒట్టి మాటేనా ? అన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: