హాజీపూర్ కు చెందిన ఎలివేటర్ మెకానిక్ మర్రి శ్రీనివాస్ రెడ్డి కి కోర్టు రోజు ఉరి శిక్షను విధించింది. నల్గొండ జిల్లా కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అయిన సివెంకట విశ్వనాధ రెడ్డి అతనిని మూడు కేసుల్లో దోషిగా పరిగణించి ఉరిశిక్షను ఖరారు చేశాడు. 30 ఏళ్ల వయసు గల శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ మానభంగం మరియు దారుణమైన హత్యలకు ఒడిగట్టినందువల్ల అతనికి శిక్షను విధించారు. ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి చంపిన అతను మరొక బాలికను శారీరక హింసకు గురి చేసి మానభంగం చేసి మరీ చంపి శవాలను దగ్గర్లోని పొలాల్లోని బోరుబావిలో పూడ్చి పెట్టేశాడు.

 

అయితే ఉరిశిక్ష విధించే ముందు జడ్జి శ్రీనివాస్ రెడ్డిని కేసు విషయమై అతను ఏమైనా చెప్పదలుచుకుంటే మాట్లామని చెప్పగా.... ఇప్పటికీ అతను తప్పులు చేయలేదని, అతనిపై బలవంతంగా కేసులు విధించారు అని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా అతని ఇద్దరి ముసలి తల్లిదండ్రులు అతని పై ఆధారపడి ఉన్నారని కాబట్టి అతన్ని వదిలివేయవలసిందిగా ప్రాధేయపడగా జడ్జి ఇప్పుడు అతని తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. దానికి అతను నాకు వారు ఎక్కడున్నారో సరిగ్గా తెలియదు అని సమాధానం చెప్పగా అతని ఆడుతున్న నాటకాలు చూసి ఆశ్చర్యపోవడం జడ్జి వంతయింది.

 

ఇకపోతే శ్రీనివాస్ రెడ్డి 11, 14, 17 సంవత్సరాల వయసు లో ఉన్న ముగ్గురు అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే నెపంతో బండి మీద ఎక్కించుకొని అతని పొలంలో బోరు బావి వద్దకు తీసుకుని వెళ్ళి చంపేశాడు. ఒక అమ్మాయిని మార్గంమధ్యలో తన ఇంటి తాళం మర్చిపోయానని బండిని రూటు మార్చగా.... మరో అమ్మాయితో పొలంలోని మోటారు స్విచ్ ఆన్ చేయాలి అని చెప్పి అక్కడికి తీసుకు వెళ్లి చంపేశాడు. ఇంకొక అమ్మాయిని నేరుగానే తన కోరిక తీర్చాలని అడగగా ఆమె ఒప్పుకోకపోయేసరికి వెంటాడి చంపేసి బోరుబావిలో విసిరేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: