బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్‌ఆర్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను భారీ స్టార్‌ కాస్ట్‌ తో రూపొందిస్తున్నారు. దక్షిణాది నటులతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్సన్‌, అలిసన్‌ డూడీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో సౌత్‌ స్టార్ జాయిన్‌ అయ్యింది.

 

దక్షిణాదిలో సీనియర్‌ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న శ్రియ ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో జాయిన్‌ అయ్యింది. అయితే ఈ సినిమాలో శ్రియ పోషించే పాత్రకు సంబంధించి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శ్రియ అజయ్‌ దేవగన్‌కు జోడిగా నటిస్తుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్తలపై చిత్రయూనిట్‌ మాత్రం స్పందించలేదు.

 

ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ తరువాత వెనకపడింది. అవకాశాలు తగ్గుముఖం పడ్డటం కొత్త తరం హీరోయిన్ల జోరు పెరగటంతో సీనియర్‌ హీరోలకు మాత్రమే శ్రియ జోడి అన్న ముద్రపడింది. ఇటీవల పెళ్లి చేసుకొని సినిమాలకు మరింత దూరం కావటంతో ఇక శ్రియ సినీ కెరీర్‌ ముగిసినట్టే అని అంతా భావించారు. కానీ తాజాగా ఆర్ఆర్ఆర్‌లో అవకాశం రావటంతో శ్రియ కెరీర్‌ మళ్లీ ఊపందుకుంటుదన్న టాక్‌ వినిపిస్తోంది.

 

బాహుబలి సినిమాతో సీనియర్‌ నటి రమ్యకృష్ణకు బ్రేక్‌ ఇచ్చిన జక్కన్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో శ్రియకు కూడా అదే స్థాయిలో బ్రేక్‌ ఇస్తాడేమో చూడాలి. ముందుగా ఈ సినిమాను జూలై 30 రిలీజ్ చేస్తారని ప్రకటించినా నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను జనవరి 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: