వెయిట్ తగ్గడం.. జీరో ప్యాక్ లకు దూరంగా ఉండే కీర్తి సురేష్ ఉన్నట్టుండి సన్నగా.. నాజూగ్గా మారిపోయింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో చూస్తే.. అసలు కీర్తియేనా అనే అనుమానం రాకమానదు. 

 

రకుల్ కాస్త వెయిట్ తగ్గినా.. తమన్నా స్లిమ్ అయినా.. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. సన్నగా ఉన్నవాళ్లు మరింతగా సన్నబడితే లైట్ గా తీసుకుంటారు ఆడియన్స్. కానీ బొద్దుగా కనిపించే కీర్తి సురేష్ వెయిట్ భారీగా తగ్గింది. ఎంతలా అంటే మహానటిలో సావిత్రిగా నటించింది ఈ అమ్మడే అంటే నమ్మబుద్ది కానంతగా.

 

మొదటి నుంచీ కాస్త బొద్దుగా కనిపించే హీరోయిన్ కీర్తి సురేష్. హిట్స్ వచ్చినా.. ఫ్లాప్ వచ్చినా.. ఒకే రకమైన ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ.. వరుస సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో పాటు.. తమిళంలో రజినికాంత్ సినిమా చేస్తోంది కీర్తి సురేష్. 

 

మహానటి అంటే కీర్తి సురేష్ అన్నంతగా ఇంప్రెస్ చేసిన ఈ అమ్మడు... వెయిట్ తగ్గడంలోనూ అదే పట్టుదలను కొనసాగించింది. కీర్తి ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. మరి ఏ మూవీ కోసం.. ఇలా వెయిట్ తగ్గిందో తెలియడం లేదు. మరి చిక్కిన ఈ బొద్దుగుమ్మను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

 

మహానటి సినిమాలో అచ్చం సావిత్రిలా మెప్పించిన కీర్తి సురేష్ ఇపుడు ఇలా అయిందేంటని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. బొద్దుగా కుందనపు బొమ్మలా ఉండే ఈ అమ్మడు బక్క చిక్కి పోయి.. అస్థిపంజరంలా కనిపిస్తుంది ఏంటని ఆశ్చర్యపోతున్నారు. కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయితే తెగ ఫీలయిపోతున్నారు. ఎంతో ముచ్చటగా.. అందంగా.. కనిపించే తమ అభిమాన నటి బక్కచిక్కిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట ఉండేలా ఉంటేనే అందంగా ఉన్నావు కానీ.. ఇలా బాగోలేవు అంటూ కీర్తి సురేష్ కు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: