టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా ఒక చోటకు చేరారంటే ఇక చెప్పేది ఏముంది ..? ఎక్కడలేని సందడి అక్కడే ఉంటుంది. ఒకరి మధ్య ఒకరికి సరదా సంభాషణలు, సందడిగా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఎన్నో అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి ఒకరికి ఒకరు చర్చించుకుంటూ ఆనందంగా గడిపారు. అయితే ఇదంతా ఎక్కడో కాదు దివంగత సినీ దర్శకుడు, సోషియో ఫాంటసీ సినిమాలు తీయడంలో దిట్ట గా పేరుపొందిన కోడి రామకృష్ణ చిన్న కుమార్తె వివాహం సందర్భంగా ఈ సందడి నెలకొంది.


కోడి రామకృష్ణ కుమార్తె ప్రవళిక- మహేష్ వివాహం హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్స్ లో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ పెళ్ళికి సినీ ఇండ్రస్ట్రీ కి చెందిన పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, రాఘవేంద్ర రావు, జయప్రద, మురళీ మోహన్, జీవిత రాజశేఖర్, గోపీచంద్, కోదండరామిరెడ్డి, అల్లు అరవింద్, దిల్ రాజు ఇలా అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక రాజకీయ నాయకులు విషయానికి వస్తే ... సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఈ  వివాహానికి హాజరయ్యారు. ఇక బాలకృష్ణ కూడా ఈ వివాహ మహోత్సవానికి  కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

 

 ఈ సందర్భంగా చిరంజీవి బాలయ్య ఒకరినొకరు ఆప్యాయంగా అనేక విషయాలపై పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కచోట చేరడం సినీ వర్గాల్లో కూడా మంచి ఉత్సాహాన్ని కలిగించింది. ఇంతమంది ప్రముఖులు ఈ పెళ్లి లో సందడి చేయడంతో అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఈ సందర్భంగా పెళ్ళికి వచ్చినవారు సినీ ప్రముఖులతో సెల్ఫీలు దిగుతూ ఆనందపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: