విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్ ఐకాన్.. చేసినవి తక్కువ సినిమాలే కానీ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఎంత తూచిన సరిపోదు. ఒక చిన్న సినిమాతో సినీరంగ ప్రవేశం. తక్కువకాలంలోనే స్టార్ హీరో స్టేటస్.. ఇప్పుడు చూస్తే పెద్ద సినిమాలు. టాలీవుడ్‌లో పెద్ద హీరోల సరసన స్దానం. అతి తక్కువకాలంలో రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లిన విజయ్ తన సినిమా వస్తుందంటే అభిమానులు ఆశతో చూసేలా మారిపోయాడు. ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్ చేయడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు..

 

 

ఇకపోతే విజయ్ ఒకేఒక్క సినిమా విజయ్ లైఫ్‌ను రంగుల రాట్నంలా తిప్పి ఆకాశాన కూర్చోపెట్టింది.. ఆ చిత్రమే అర్జున్ రెడ్డి.. ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ తెచ్చేసు కున్నాడు. గీతగోవిందం సినిమాతో స్టార్ అయిపోయాడు. అబ్బాయిల స్టైల్స్‌కు కేరాఫ్‌గా, అమ్మాయిల కలలకు రాకుమారుడిలా మారిపోయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నట్లుండి ఈయన తీసుకున్న నిర్ణయంతో ఈయన అభిమానులు, దర్శకులు అంతా షాక్‌లోకి వెళ్లిపోయారట..

 

 

అదేమంటే కాసేప‌టి క్రితం హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌ ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఇదే త‌న చివ‌రి ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని చెప్పేశాడు విజయ్. ఇకపోతే ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు త‌న చివ‌రి ప్రేమ‌క‌థ ఇదే అవుతుంద‌ని త‌న‌కు అర్థ‌మైంద‌ని, అందుకే ఈ సినిమాలోనే త‌న ప్రేమ‌నంతా ధార‌బోశార‌ని అదీ కాకుండా త‌న అభిరుచులు మారుతున్నాయ‌ని, మ‌నిషిగానూ మార్పులొస్తున్నాయ‌ని,

 

 

అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని కాస్త షాకింగ్ కామెంట్లు చేశాడు ఈ యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. మరి దీనర్ధం ఏంటంటే విజ‌య్ కోసం ఎవ్వ‌రూ ప్రేమ‌క‌థ‌లు రాయ‌కూడ‌ద‌న్న‌ మాట‌. రాసినా చేయ‌డ‌న్న‌మాట‌.. ఈ మాట విన్న అభిమానులు మాత్రం అదెంటీ భయ్యా 50 ప్లస్ ఉన్న హీరోలే ప్రేమ కధలు చేస్తుంటే, యంగ్ హీరోగా ఉన్న మీరు ఇప్పుడు ప్రేమ‌క‌థా స‌న్యాసం తీసుకోవ‌డం ఏమిటో అంటూ బిక్కమోహం వేస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: