ప్రశాంతంగా చల్లటి వాతావరణంలో వేడి కాగి నట్టు సినిమా చూసి రావాలంటే శేఖర్ కమ్ముల సినిమాకి వెళ్ళాల్సిందే అన్నట్టు టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. దీని క్రియోట్ చేసుకున్నాడని అంటే ఇంకా బావుంటుందేమో. ఇక మన టాలీవుడ్ దర్శకున్న సెంటిమెంట్స్ మీద రెగ్యులర్ గా రక రకాల కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఒక సినిమా హిట్టయితే అందుకు ముఖ్యమైన కారణాలని వెతికి దానిని సెంటిమెంటుగా ఆ తర్వాత ఫాలో అవుతుంటారు చాలామంది మేకర్స్. కోట్ల బడ్జెట్లు కేటాయింది మన సినిమా రంగంలో ప్రతిదీ సెంటిమెంటుగా మారుతుంటుంది. కథలు రాయడం నుంచి.. ముహూర్తపు సన్నివేశం వరకూ.. తెరకెక్కించే లొకేషన్ల ఎంపిక, లక్కీ హీరోయిన్, రిలీజ్ కి లక్కీ డేట్, లక్కీ ఫెస్టివల్ ఇలా రక రకాల సెంటిమెంట్స్ ని ఫాలో అయ్యో వాళ్ళు చాలామంది ఉన్నారు.  

 

ఆ తరహాలో కాస్త డీప్ గా గమనిస్తే శేఖర్ కమ్ముల సినిమాలలో నైజాం ప్రాంతం యాస, భాష సంస్కృతి తప్పనిసరిగా ఇరికిస్తాడు. అంతే కాదు కమ్ములకి అదే సెంటిమెంటుగానూ మారింది. ఇక స్వతహాగా హైదరాబాద్ వాసి కాబట్టి కమ్ములకు ఈ కల్చర్ తో ఉన్న అనుబంధం గొప్పదే అని చెప్పొచ్చు. అదే ఆయన ప్రతి సినిమాలోనూ కొన్ని సన్నివేశాలో ఆవిష్కరిస్తుంటారు. ఇంతకుముందు ఫిదా సినిమాని తెలంగాణలోని నిజామాబాద్ లో ఎక్కువగా భాగం చిత్రీకరించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అందుకే ఇప్పుడు నిజామాబాద్ సెంటిమెంటును కమ్ముల వదలడం లేదట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా 'లవ్ స్టోరి' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాకి నిజామాబాద్ సెంటిమెంటును విడిచిపెట్టడం లేదట. అయితే ఫిదా ఏదో లక్కిగా హిట్ అయిపోయింది కానీ.. ప్రతిసారీ అలా జరుగుతుందా?  ఇప్పుడు నాగచైతన్య లాంటి పెర్ఫామర్ తో సాయి పల్లవి ని పెట్టి సినిమా చేయడం అంటేనే మామూలు విషయం కాదు. పైగా నిర్మాత సునీల్ నారంగ్ టైమ్ అసలు బాగోలేదు. ఆయన ప్రతి ప్రాజెక్ట్ భారీ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. మరి సెంటిమెంటు పరంగా చూస్తే ఈ రకంగాను చూడాలి కదా అన్న మాటలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే సెంటిమెంటు కంటే కూడా గట్టి కంటెంట్ తో హిట్ కొడితే జనం పరిగెత్తుకుంటూ థియేటర్లకు వస్తారన్నది మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. 

మరింత సమాచారం తెలుసుకోండి: