టాలీవుడ్ సీనియర్ నటులు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా బాలనటుడిగా నీడ సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన మహేష్ బాబు, చిన్న వయసులోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక అక్కడినుండి బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్, బాలచంద్రుడు సినిమాతో కొద్దిపాటి విరామం తీసుకుని, ఆ తరువాత డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ తదితర వాటిలో మరింత శిక్షణ తీసుకుని 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఆ సినిమా పలు రికార్డ్స్ నెలకొల్పింది. ప్రిన్స్ గా తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహేష్ బాబు, రెండవ సినిమాతో ఎవరూ చేయలేని ఒక డేరింగ్ స్టెప్ వేశారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో మహేష్ నటించిన రెండవ సినిమా యువరాజు. సిమ్రాన్, సాక్షి శివానంద్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నాలుగేళ్ళ వయసున్న కొడుక్కి తండ్రిగా మహేష్ ఎంతో బాగా నటించి మంచి పేరు దక్కించుకున్నారు. 2000వ సంవత్సరం ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 

 

అయితే హీరోగా ఫస్ట్ సినిమాతో అత్యద్భుతమైన పేరు ప్రఖ్యాతలు గడించిన మహేష్ బాబు, తనకు వచ్చిన స్టార్డం ని ప్రక్కన పెట్టి మరీ రెండవ సినిమాతో ఒక బిడ్డకు తండ్రిగా నటించడం నిజంగా డేరింగ్ స్టెప్ వేయడమే అని అప్పట్లో ఆయన పై మంచి ప్రశంసలు కురిసాయి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో మహేష్ నటించగా, శ్రీవల్లి గా సాక్షి శివానంద్, శ్రీలతగా సిమ్రాన్ నటించిన ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటుడు శివాజీ నటించగా, ప్రముఖ దివంగత కమెడియన్స్ అయిన ఎమ్ ఎస్ నారాయణ, ఏవీఎస్ కీలక పాత్రల్లో నటించారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: