నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో వరుసగా మూడు భారీ ఫ్లాపులు అందుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లు గా మొదట్లో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తాయని నందమూరి ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను ఆ సినిమాలు రెండు నిరాశను మిగల్చగా, ఇటీవల కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన రూలర్ సినిమా కూడా ఏ మాత్రం అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అతి త్వరలో తనకు సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

ద్వారకా క్రియేషన్స్ అధినేత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగానిర్మితం కానున్న ఈ సినిమాలో బాలయ్య రెండు పవర్ఫుల్ రోల్స్ లో నటించనున్నట్లు టాక్. అయితే అందులో ఒక పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఇక రోల్ లో బాలయ్య చెప్పే డైలాగ్స్ కు థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ ఆదరిపోతాయని, కాగా ఆ సినిమాలోని కొన్ని అద్భుతమైన డైలాగ్స్ లో ఇది కూడా ఒకటి అంటూ ఒక డైలాగ్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. 'సింహం ఎదురైతే సిగపట్టుపట్టొచ్చు....పులి ఎదురైతే పోరాడొచ్చు.... అదే డైనోసార్ ఎదురైతే డేర్ చేయగలవా'   అంటూ బాలయ్య పలికే ఈ డైలాగ్ థియేటర్ లో వింటే ప్రతి ఒక్కరికీ పూనకాలు రావడం ఖాయం అని, 

 

సినిమాలోని ఒక కీలక సీన్ లో ప్రతినాయకుడితో బాలయ్య చెప్పే డైలాగ్ ఇదని అంటున్నారు. అయితే ప్రస్తుతం విస్తృతంగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ డైలాగ్ నిజంగా సినిమాలో ఉండనుందా, లేదా అనే విషయం పై క్లారిటీ లేనప్పటికీ, ఒకవేళ నిజంగానే ఇది సినిమాలోని డైలాగ్ అయితే, దీనిని బాలయ్య మరింత అదిరిపోయేలా పలికి మరింత గొప్పగా పండిస్తారని చెప్పవచ్చు....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: