అజ్ఞాతవాసి తరువాత సుమారు రెండేళ్లు సినిమాలకు దూరంగా వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తాజాగా మళ్ళీ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేశాడు. అందులో భాగంగా  ప్రస్తుతం  పవన్ .. పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. సాలిడ్ సోషల్ మెసేజ్ తో రానున్నఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. దాంతో ఈసినిమా కు వకీల్ సాబ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. యువ హీరోయిన్లు అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈరీమేక్ ను  డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది. 
 
ఇక ఈ సినిమాతోపాటు పవన్ కళ్యాణ్ ,క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో నటించడానికి ఓకే చెప్పాడు. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాగా పవన్  ఇంకా షూటింగ్ లో జాయిన్ కావాల్సింది. ఇదిలావుంటే తాజాగా పవన్ కళ్యాణ్  క్లీన్ షేవ్ తో  కనిపించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి దాంతో ఈ సినిమా కోసమే పవన్  కొత్త లుక్ లోకి మారాడని ప్రచారం జరుగుతుంది.
 
తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న కథ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలే గాక హరీష్ శంకర్ తో కూడా  ఓ సినిమా చేయనున్నాడు పవన్.  మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: