పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. చివరగా అజ్ఞాతవాసి సినిమాలో నటించిన పవన్‌, తరువాత పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించాడు. ఒక దశలో ఇక సినిమాలకు గుడ్‌  బై చెపుతున్నట్టుగా కూడా ప్రకటించాడు పవన్‌. కానీ 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకావటంతో తిరిగి సినిమాల్లో నటిస్తున్నాడు.

 

వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. పింక్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియడ్‌ డ్రామా, హరీష్ శంకర్‌ దర్శకత్వంలో కమర్షియల్  ఎంటర్‌టైనర్‌లలో నటిస్తున్నాడు. ఇప్పటికే పింక్‌ రీమేక్‌కు సంబంధించిన షూటింగ్ కొంత మేర పూర్తయ్యింది. క్రిష్ సినిమా కూడా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది.

 

అయితే తాజాగా పవన్‌ కళ్యాణ్ న్యూ లుక్‌లో ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా గుబురు గెడ్డంతో కనిపిస్తున్న పవర్‌ స్టార్‌ తాజాగా క్లీన్‌ షేవ్‌తో షాక్‌ ఇచ్చాడు. గురువారం సాయంత్రం జరిగిన జనసేన పార్టీ మీటింగ్‌లో పవన్‌ ఈ న్యూ లుక్‌తో అందరికీ షాక్‌ ఇచ్చాడు. అయితే ఈ లుక్‌ ఏ సినిమా కోసం అన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

 

పింక్‌ రీమేక్‌ షూటింగ్‌లో గెడ్డంతోనే పాల్గొన్నాడు పవన్‌. ఈ సినిమాలో పవన్‌ పాత్రకు ఆ లుక్‌ అయితేనే పర్ఫెక్ట్. మరి అప్పుడే ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యిందా..? క్రిష్ సినిమా కోసం పవన్‌ కొత్త లుక్‌లోకి మారిపోయాడా..? లేక పింక్‌ రీమేక్‌లోనే పవన్‌ రెండు లుక్స్‌లో దర్శనమివ్వనున్నాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

అయితే ఈ లుక్‌ క్రిష్ సినిమా కోసం అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ మూవీలో పవన్‌ రాబిన్‌ హుడ్ తరహా పాత్రలో నటించనున్నాడట. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే ఆ సినిమాల ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లన్నా బయటకు రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: