ఒకప్పుడు మళయాళంలో అడల్ట్ సినిమాలతో అందరినీ ఆడుకున్న షకీలా స్టార్స్ కే చుక్కలు చూపించింది. ఈవిడగారి సినిమా రిలీజ్ అంటే మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కూడా హడలి చచ్చేవాళ్ళు. చచ్చినట్టు తమ సినిమాలని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు. అంతగా తన సినిమాలతో ఆక్రమించేసింది షకీలా. తప్పని పరిస్థితుల్లో తప్పుడు సినిమాలు చేసినప్పటికి ఎప్పుడు తపుడు పనులు చేయలేదని చాలా సందర్భాలలో షకీలా వెల్లడించింది. అంతేకాదు ఎంతమంది అష్యైంచుకున్నప్పటికి ఎదురొడ్డి నిలబడింది. అయితే ఒక స్టార్ హీరోయిన్ కి టైం అయిపోయినట్టుగా షకీలాకి తన సినిమాలు చూసిన జనాలకి బోర్ కొట్టేసి ఈవిడ పని అయిపోయింది. దాంతో క్రేజ్ తగ్గిపోయింది. ఇక అప్పటి నుంచి అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 

తన సినిమాలకి గుడ్ బాయ్ చెప్పేసి కాస్త పద్దతైన వేశాలు వేసుకుంటుంది షకీలా. ఇక రీసెంట్ గా షకీలా నటించిన 'షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం' టీజర్ లో ఏపీ మూడు రాజధానులపై పంచ్ లేసింది. అయితే తన సినిమా ప్రచారం కోసమే ఇలా దిగజారుడు టీజర్లు వదుల్తోంది! అంటూ నెటి జనులు తన సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన కృతజ్ఞత కూడా లేకుండా షకీలా ని తిట్టిపోస్తున్నారు. అయితే తాజాగా మరోసారి టాలీవుడ్  స్టార్ హీరోలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయింది షకీలా. ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు....స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లను టార్గెట్ చేసి మాట్లాడింది. ఓ ఇంటర్వూలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా అడిగిన వాటికి వచ్చిన సమాధానాలు హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు నా తమ్ముడు లాంటోడు....బన్నీ ఎవరో నాకు తెలియదు! అంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలకి సోషల్ మీడియాల్లో బన్ని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

తెలుగు సినిమాల్లో నటిస్తున్నావ్.. నీ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. నిన్ను నీ సినిమాలని చూసి మేము ఆదరించాము. బన్నీ లాంటి టాప్ స్టార్ ను  తెలియదని అంటావా? అంటూ మండిపడుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీపై షకీలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తన సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆరోపణల్లో భాగంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లు అప్పట్లో న్యూస్ బాగా వైరల్ అయింది. ఇక షకీలా సొంత ఇండస్ట్రీలో మల్లూ అర్జున్ గా పాపులరైన బన్నీ ఎవరో తెలీదని షకీలా అనేసి బుక్కైపోయింది. ఇదంతా ఒక ఎత్తైతే మహేష్ బాబు నా తమ్ముడు అన్న మాటకి ఆయన ఫ్యాన్స్ కూడా ఇంతెత్తున ఎగిరి పడుతున్నారు. చీ..చీ..సూపర్ స్టార్ నీకు తమ్ముడెలా అవుతాడు నమ్రత కి తెలిస్తే తోలు తీసేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: