ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక సంచలనమైన విషయం బయట పడుతోంది. కానీ ప్రపంచంలో రోగం వచ్చినా అది మనిషి స్వయంకృతాపరాధం అన్నది అక్షర సత్యం. ఎన్నిసార్లు దెబ్బతిన్నా మానవుడికి బుద్ధి మాత్రం రావట్లేదు. అలాగే చైనాలో కూడా మనుషుల తప్పిదం వల్లే కరోనా వైరస్ వ్యాపించింది. అయితే దానిని ఆదిలోనే తుంచేసే ప్రయత్నం మానేసి ఇన్ని ప్రాణాలు బలి తీసుకునే స్థాయివరకూ తెచ్చింది చైనీయులే. వారు చేసిన అతిపెద్ద తప్పు ఇప్పుడు బట్టబయలైంది.

 

ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తున్న విషయం ఏమిటంటే చైనా కు చెందిన లీ వెన్లియాంగ్ అనే డాక్టర్ గత సంవత్సరం డిసెంబర్ లోనే ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించాడు. అతను ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఏడుగురు పేషెంట్స్ దగ్గర కరోనా వైరస్ యొక్క లక్షణాలను చూసినట్లు మెడికల్ స్కూల్ వారికి సమాచారం ఇచ్చాడు. ఏడుగురు పేషెంట్లు కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి లక్షణాలతో హాస్పిటల్ లో అడ్మిట్ కావడంతో అతనికి అనుమానం వచ్చి ఇది చాలా పెద్ద వైరస్ అని దీని లక్షణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి అని వారికి చెప్పాడు.

 

అంతేకాకుండా ల్యాబ్ రిపోర్టులను పరిశీలించిన మీదట ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపే అతి అరుదైన వైరస్ జాతిలో ఇది చెందినదని అని.... ఇలాంటి దానివల్లే చైనాలో 2003లో 800 మంది చనిపోయారని కూడా వారికి గుర్తు చేశాడు. అయితే మెడికల్ స్కూల్ వారు దీనిపై చర్యలు తీసుకోకముందే లీ తన కుటుంబ సభ్యులకు మరియు ఆప్తులకు విషయం చెప్పి వారందరినీ అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా పుణ్యమా అని అతను వారికి పంపించిన స్క్రీన్ షాట్లు కాస్తా దేశం మొత్తం పాకేశాయి.

 

అప్పటికి కరోనా వైరస్ గురించి ఎవరికీ పెద్ద ఐడియా లేకపోవడంతో లీ అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నాడు అని అరెస్ట్ చేశారు. చివరికి పేషెంట్స్ ని ట్రీట్ చేయడం వల్ల అతనికి కూడా కరోనా వైరుస్ సోకడంతో అతను కూడా వందలాది మందితో పాటు మృతిచెందడంతో తలలు పట్టుకోవడం చైనా వారి వంతు అయింది. అయితే లీ చెప్పినప్పుడు కావాలనే అప్రమత్తం కాకుండా కొంతమంది కుట్ర ప్రకారం అతనిని అరెస్టు చేయించారని వార్తలు కూడా ఇప్పుడు చైనా లో జోరుగా విహరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: