విజయ్ దేవరకొండ అనగానే అందరికి ముందు గుర్తొచ్చోది పెళ్లి చూపులు'.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి. పెళ్లి చూపులు అనే సాఫ్ట్ లవ్ స్టోరీతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ అప్పటి నుండి ఇప్పటి వరకూ చేసినవన్నీ లవ్ స్టోరీసే.. మధ్యలో 'నోటా' అనే పొలిటికల్ డ్రామా తప్ప మిగిలిన అన్ని సినిమాలు ప్రేమ కథాంశంతో తెరకెక్కినవే. ఇలా బ్యాక్ టూ బ్యాక్ లవ్ స్టోరీస్ తో యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ అందుకున్న విజయ్ ఇప్పుడా ఇమేజ్ ను పక్కన పెట్టి కొత్త ఇమేజ్ తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్నాడు. అందుకు కారణం కూడా బాగానే చెబుతున్నాడు ఈ కుర్ర హీరో.

 

ఇకపై లవ్ స్టోరీస్ కి ఫులిస్టాప్ పెట్టనున్నాని అన్నాడు రౌడీ హీరో. ఈ విషయాన్ని 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పబ్లిక్ గా చెప్పాడు. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ ఇకనుంచి నా రూటే సెపరేట్ అంటూ చెప్పుకున్నాడు. ఫిబ్రవరి 14 న వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్ ప్రస్తుతం పూరితో ఫైటర్ అనే పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ డైలాగ్స్ ఇలా అన్నీ మాస్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసేలా ఉంటాయట. ఒక్క ముక్కలో చెప్పాలంటే పూరి సినిమాతో సరికొత్త విజయ్ ను చూడబోతున్నారు ప్రేక్షకులు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పూరి సినిమాలలో హీరోలు ఎలా ఉంటారో దానికి నాలుగు రెట్లు విజయ్ చూపించబోతున్నాడట.

 

అందుకే పూరి మాయలో పడిన రౌడీ ఇకపై లవ్ స్టోరీస్ ను పక్కన పెట్టి మాస్ కథలతో ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మధ్యలో ఒకటి రెండూ గీత గోవిందం లాంటి ఏదైనా ఎమోషనల్ సినిమాలు మాత్రమే చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. మరి విజయ్ చెప్పిన మాట మీదే నిలబడి సినిమాలు చేస్తాడా లేదా ఎవరైనా ఎట్రాక్ట్ చేసే లవ్ స్టోరీతో వస్తే తన డిసిషన్ మార్చుకుంటాడా చూడాలి.

 

అయితే తాజాగా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ చూసిన వాళ్ళంతా విజయ్ మీద విరుచుకు పడుతున్నారు. అర్జున్ రెడ్డి మానరిజంస్ తప్ప ఇంక నీలో ఏమీ లేవా ..గీత గోవిందం చేసింది నువ్వే కదా ..ఇంకా ఎందుకు ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు చేస్తావు. మంచి సినిమాలు ఆశిస్తున్నాము నీ నుంచి. అంటూ ఏకిపారేస్తున్నారట. మరి మరి కాస్త ఆలోచించాలి. అన్ని సినిమాలల్లో మందు, సిగరెట్, ముద్దులు అంటే చిరాకు వచ్చి నీ సినిమాలు చూడటం మానేస్తారు కదా ...!
    

మరింత సమాచారం తెలుసుకోండి: