ఈరోజు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ సమంత మరియు టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ జంటగా నటించిన 'జాను' సినిమా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. సినిమా తమిళంలో విజయ్ సేతుపతి మరియు త్రిష జంటగా నటించిన 96 సినిమాకి రీమేక్. తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాడు. అయితే చిత్రాన్ని తమిళంలోనే చాలామంది తెలుగు కుర్రకారు చూశారు కాబట్టి తెలుగులో ఆడుతుందా లేదా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ జాను సినిమా థియేటర్ల వద్ద తన సత్తా చూపించింది.

 

సినిమాలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫ్లాష్ బ్యాక్ గురించి. మనందరికీ చిన్నతనంలో ఎన్నో లవ్ స్టోరీస్ ఉండే ఉంటాయి. వాటన్నింటినీ ముడివేసి జతకడితే ఒక అందమైన ప్రేమ కావ్యం తయారవుతుంది. అలాంటి ప్రేమ కావ్యాలను మేలిమి బంగారంలా మెరిసేలా చేయడమే స్క్రిప్ట్ యొక్క గొప్పతనం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి రోజులకు టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత ట్రెండ్ లో ప్రేమ నడుస్తున్న విధానానికి.... గత కాలంలోని స్వచ్ఛమైన ప్రేమకు ఉన్న వ్యత్యాసాన్ని చాలా గొప్పగా చూపించే కథ ఇది.

 

స్టోరీ లైన్ తమిళంలో సూపర్ హిట్ అయ్యి తెలుగులో కూడా అదే టెంపో నీ కొనసాగించింది. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు శర్వానంద్-సమంత కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పడింది. చరిత్రలో గుర్తుంచుకోదగిన ప్రేమ కావ్యాలు రోజా, ప్రేమికుడు, బొంబాయి, గీతాంజలి మొదలగు చిత్రాల సరసన కచ్చితంగా 96 అలియాస్ జాను స్థానాన్ని పొందింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: