ఇటీవల అన్ని భాషల్లోనూ రీమేక్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాను మరో భాషలో రీమేక్‌ చేయటం కామన్‌ అయిపోయింది. అయితే ఇలాంటి సినిమాల్లో భారీ విజయాలు మాత్రం పెద్దగా దక్కటంలేదు. ఒరిజినల్ వర్షన్‌లో ఉన్న కథా కథనాలు తెరకెక్కించగలిగినా ఆ సోల్‌ను పట్టుకోవటంలో రీమేక్‌ దర్శకులు ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా క్లాసిక్స్‌ నిలిచి పోయిన సినిమాలను టచ్‌ చేయకపోవటమే బెటర్‌ అన్న స్థాయిలో ఉన్నాయి రిజల్ట్స్‌.

 

కానీ ఈ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి ఓ క్లాసిక్‌ హిట్‌ను తెలుగులో రీమేక్‌ చేశారు. తమిళ్‌లో ఎమోషనల్‌ హిట్‌గా నిలిచిన 96 సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్‌ చేశారు. ఒరిజినల్ వర్షన్‌ను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిషలు జంటగా నటించగా తెలుగులో శర్వానంద్‌, సమంతలు నటించారు. అయితే తమిళ్‌లో అద్భుతమైన నటనతో విజయ్‌, త్రిషలు మేజిక్‌ చేయగా తెలుగులో అదే మ్యాజిక్‌ రిపీట్ అయ్యిందా..?

 

96 సినిమా త్రిష ఇమేజ్‌నే మార్చేసింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నటిగా ప్రూవ్‌ చేసకునేందుకు కష్టాలు పడుతున్న త్రిషకు ఈ సినిమా సాలిడ్‌ బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్‌ అయి ఏడాది దాటుతున్న ఇప్పటికే ఏదో ఒక వేదిక మీద జాను పాత్రకు అవార్డులు అందుకుంటూనే ఉంది త్రిష. ఇప్పటి వరకు వచ్చిన టాక్‌ ప్రకారం సమంత అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయటం సక్సెస్‌ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది. శర్వా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. 

 

తమిళ్‌లో ఘనవిజయం సాధించటంతో పాటు భారీ హైప్‌ రావటంతో తెలుగు ప్రేక్షకుల కూడా చాలా మంది ఈ సినిమాను చూశారు. దీంతో కథ పరంగా జాను పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడాపెద్దగా లేకపోవటంతో మాస్ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సినిమా ఎలాగో చాలా మందికి తెలిసిందే కాబట్టి వారు స్టోరీ కోసం పెద్దగా ఆలోచించుకోకపోవచ్చు కానీ తెలీని వారికి ఇది మంచి అనుభవంగా అనిపిస్తుంది. సినిమా ఓకే అనేలా ఉన్నా.... అలా ఓ ఫ్లో లో నెమ్మదిగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ కానీ శర్వా మరియు సమంతల మధ్య సీన్లు.. ఫీల్ గుడ్ మూవీగా నిలిచింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: