మహేష్ మినహా అందరి దృష్టి బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఉంది. అవకాశం వస్తే చాలు తాము బాలీవుడ్ సినిమాలలో నటించడానికి రెడీ అంటూ ఓపెన్ గానే అనేకమంది టాప్ హీరోలు మీడియా ఇంటర్వ్యూలలో చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ తన బాలీవుడ్ మ్యానియాను కొనసాగించడానికి తన లేటెస్ట్ మూవీకి ఎవ్వరూ ఊహించని టైటిల్ ఫిక్స్ చేసాడు. 


అయితే బాలీవుడ్ గురించి ఏమాత్రం పట్టించుకోని పవన్ కళ్యాణ్ కూడ తన లేటెస్ట్ మూవీకి కూడ ప్రభాస్ అడుగుజాడలనే అనుసరించడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ జిల్ రాథా కృష్ణల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీకి ‘రాదేశ్యామ్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ తో పాటు అదనంగా ఈ మూవీకి ‘ఓ డియర్ అనే టైటిల్ ను కూడ స్పేర్ గా రిజిస్టర్ చేసినట్లు టాక్. 


ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ కు ఇప్పటి వరకు వచ్చిన ఊహాగానాలు ప్రకారమే ‘లాయర్ సాబ్’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసి అదనంగా ఎందుకైనా మంచిదని ‘వకీల్ సాబ్’ అన్న టైటిల్ ను కూడ రిజిష్టర్ చేసారు అని అంటున్నారు. దీనితో ఎక్కువగా తెలుగు భాష గురించి తెలుగు భాష ప్రాముఖ్యత గురించి పోరాటం చేసే పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ మూవీకి మాత్రం హిందీ మూలాలు ఉన్న టైటిల్ ను ఫిక్స్ చేసుకోవడం అత్యంత ఆశ్చర్య కరం.


‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత పవన్ కు సినిమాలు అంటే భయం వేసింది. ‘సాహో’ ఫెయిల్యూర్’ తరువాత ప్రభాస్ తనకు ఎన్ని ఆఫర్లు వస్తున్నా ఒప్పుకోవడానికి భయపదిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరూ వారికి వచ్చిన ఘోర అవమానాల నుండి తేరుకుని నటిస్తున్న వీరిద్దరూ సినిమాలు ఈ సంవత్సరమే విడుదల అవ్వడం యాధృశ్చికం అనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: