మాస్ మహారాజా రవితేజ హీరోగా పాయల్‌రాజ్‌పుత్ హీరోయిన్గా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం సైంటిఫిక్ నేపధ్యంలో తెరకెక్కింది. ఇది ఆశించినంత ఫలితం రాలేదు. బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా బాగా దెబ్బతిన్నాయనే చెప్పాలి. ఓ పక్క సంక్రాంతి సెలవులు అయిపోయి దెబ్బ పడిందా లేదా కథ కథనాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయ అన్న విషయాలు పక్కన పెడితే ఈ చిత్రానికి మాత్రం అనుకున్నంత హిట్ అయితే రాలేదు. ఇక ఈ మధ్య కాలంలో రవితేజ నటించే చిత్రాలన్నీ పెద్దగా హిట్ కావడం లేదు.
ఇక ఇదిలా ఉంటే రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 2 బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 8 న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్లో రవితేజ శృతి హాసన్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చీరాల సమీపంలోని రామాపురం బీచ్ లో జరుగుతోంది. ఓ పాటను, కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరి కనీసం రవితేజకి ఈ చిత్రమైన హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి. అలాగే శృతి హాసన్‌కి ఇది రీఎంట్రీ చిత్రం అనుకోవాలి. చాలా గ్యాప్ తర్వాత శృతి రవితేజతో కలిసి వస్తుంది. అలాగే ఇందులో కోలీవుడ్ యాక్టర్స్ వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.