సమంత, శర్వానంద్‌ జంటగా తెరకెక్కిన జాను సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన 96కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా కావటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇంట్రస్టింగ్‌ స్టార్‌ కాస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్‌, ట్రైలర్‌తో పాటు లిరికల్‌ వీడియోలకు కూడా సూపర్బ్‌ రెస్సాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ప్రేమ కథ ప్రతీ ఒక్కరి కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

 

కమర్షియల్‌ సినిమా హవా నడుస్తున్న ఈ ట్రెండ్‌లోనూ జాను కథ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా సినిమాలోని ఎమోషన్స్‌, సీన్స్‌ ప్రతీ ఒకరికీ తమ జీవితంలో ఏదో ఒక సందర్బంలో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తాయని నమ్మకంతో ఉన్నారు. ఆ ఎమోషనల్‌ కనెక్టే సినిమాను సక్సెస్‌ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. వాలెంటైన్స్‌ డేకు ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రేమకథ ప్రతీ ఒక్కరి కథ అనేలా ఉంటుందని భావిస్తున్నారు.

 

తమిళ్‌లో విజయ్‌ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా సాధించింది. అందుకే ఈ సినిమాను ఏరీ కోరీ రీమేక్‌ చేస్తున్నాడు దిల్‌ రాజు. సినిమాలో కంటతడి పెట్టించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని ఆ కంటెంట్‌ నచ్చే రీమేక్ హక్కులు తీసుకున్నానని వెల్లడించాడు దిల్ రాజు.

 

సమంత కూడా సినిమాకు కర్ఛీఫ్‌ తీసుకెళ్లండి అంటూ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. అయితే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా నేరేషన్‌ కాస్త నెమ్మదిగా సాగుతుంది. భారీ ట్విస్ట్‌లు టర్న్‌లు లేకపోవటంతో కమర్షియల్‌ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. కానీ ఎమోషనల్ డ్రామాలు ఎంజాయ్‌ చేసేవారు మాత్రం జానుకు ఇట్టే కనెక్ట్ అయిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: