శర్వానంద్ మరియు సమంత జంటగా నటించిన జాను తెలుగు సినిమా చరిత్రలో ఒక మనసును హత్తుకునే గొప్ప లవ్ స్టోరీలా మిగిలి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. విడుదలైన మొదటి ఆట నుండే భీభత్సమైన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తమిళంలో ని 96 సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఏ మాత్రం తీసిపోకుండా.... ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కొన్ని చోట్ల ఆ సినిమానే మించిపోయేలా తెలుగులో చిత్రీకరించబడింది. ఈ సినిమాకి పెద్ద ఆస్తి ఎవరూ అంటే కచ్చితంగా హీరో హీరోయిన్ లే. 

 

అందరూ అంటున్నట్లు ఈ టైప్ సినిమాలకు కథే హీరో. కానీ ఎంత మంచి కథని అయినా ముఖ్య పాత్ర లో ఉండే నటీనటులు గొప్పగా పోషించకపోతే దాని గొప్పతనం ఎవరికీ అర్థం కాదు. అయితే ఈ విషయంలో శర్వానంద్ మరియు సమంత ఒకరికొకరు పోటీగా చేశారు. ఎవరూ ఏ క్షణంలోనూ తగ్గలేదు. ఈ కథ వీరి కోసమే పుట్టిందా అన్నట్లు పర్ఫామెన్స్ ఇచ్చారు ఇద్దరూ. ఫ్లాష్ బ్యాక్ లోని లవ్ స్టోరీ ని తలచుకుంటూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసి మాటలు తక్కువ భావాలు ఎక్కువ ఉండే ఇటువంటి క్లిష్టమైన పాత్రలను చాలా గొప్పగా మరియు అవలీలగా పండించిన తీరుని ఎంత మెచ్చుకున్నా తక్కువే.

 

సమంత బాగా అనుభవం మరియు ఇటువంటి లవ్ స్టోరీస్ చాలానే చేసిన నటి. అయితే శర్వానంద్ రొమాంటిక్ సినిమాలు చేసింది ఒకటో రెండో అయినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కానీ ఈ సినిమాలో శర్వ అతనిలోని దాగి ఉన్న కోణాన్ని చూపించి సమంత తో పోటీగా నటించడమే చిత్రంలో ప్రధాన హైలెట్. ఇక తెలుగు సినిమాల్లో లవ్ స్టోరీస్ అంటే హీరో కోసం శర్వ వైపు మరియు హీరోయిన్ కోసం సమంత వైపు దర్శకనిర్మాతలు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: