టాలీవుడ్లో చాలా మంది యువ హీరోలు ఉన్నారు... యువ హీరోల సరసన నటించేందుకు ఎంతో మంది హీరోయిన్లు కూడా ఉన్నారు. అంతే కాకుండా కొత్త కొత్త హీరోయిన్లు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో యువ హీరోల సరసన నటించేందుకు హీరోయిన్ల కొదవ ఎక్కడా లేదు. యువ హీరోల  సంగతి అటుంచితే మరి సీనియర్ల పరిస్థితి ఏంటి. సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడింది.కొత్తగా వచ్చిన హీరోయిన్లను పెట్టుకుందామంటే వయసు తక్కువగా కనిపిస్తోంది... పాత హీరోయిన్ లను  పెట్టుకుందామంటే అవుట్ డేటెడ్  హీరోయిన్ లు  ఉంటున్నారు. దీంతో సీనియర్ స్టార్ హీరోల అందరికీ ఒకే ఒక్క హీరోయిన్ దిక్కయిపోయింది . ఏ సినిమా చేయాలన్న ఆ హీరోయిన్ వైపే చూస్తున్నారు సీనియర్ స్టార్ హీరోలు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా లేడీ సూపర్ స్టార్ నయనతార. 

 

 

 ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నయనతార మరోవైపు స్టార్ సీనియర్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి అదరగొడుతోంది. ప్రస్తుతం స్టార్ సీనియర్  హీరోలందరూ నయనతార వైపే మొగ్గు చూపుతుండటం తో అందరూ స్టార్ సీనియర్  హీరోల సరసన మెరుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లకు.. హీరోయిన్స్ పెద్ద సమస్యగా మారింది అని చెప్పాలి. దీంతో వీరందరూ ప్రస్తుతం మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న సీనియర్ హీరోయిన్ నయనతార వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు తమిళ కన్నడ సినిమాల్లో కూడా సీనియర్ హీరోలకి నయనతారే ఆప్షన్ అయిపోయింది. 

 

 

 ఇటీవలే రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న దర్బార్ మూవీ లో కూడా నయనతార రజనీకాంత్  తో కలిసి నటించింది. ఇక ఇప్పుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నయనతారనే ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో కూడా నందమూరి బాలకృష్ణ సరసన ఇప్పటికే పలుమార్లు నటించిన నయనతార... ఇప్పుడు మరోసారి బాలయ్య పక్కన నటించేందుకు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది.హిట్  కాంబినేషన్ అయినా బాలయ్య బోయపాటి కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా శ్రియ ని సెలెక్ట్ చేయగ... మరో  హీరోయిన్గా నయనతార కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం నయనతారకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఈ సినిమాలో నటించడానికి నయనతార కాదనలేకపోయింది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: