రోజు విడుదలైన జాను సినిమా మొదటి టాక్ చాలా పాజిటివ్ గా వచ్చింది. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన 96 సినిమా రీమేక్ గా తెరకెక్కిన చిత్రంలో సమంత మరియు శర్వానంద్ చాలా అద్భుతంగా నటించారు. విజయ్ సేతుపతి మరియు త్రిష లాంటి వైవిధ్యమైన నటీనటులకు ఏమాత్రం తీసిపోకుండా వీరు చేసిన నటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇకపోతే చిత్రం తెలుగులో కూడా ఇంత గొప్పగా రావడానికి కారణం తమిళంలో చిత్రం రీతిలో అయితే స్క్రీన్ ప్లే మరియు అన్ని విభాగాలను అందంగా తీర్చిదిద్దిందో అదే రీతిలో తెలుగులో కూడా ఎక్కడ పొల్లుపోకుండా అనుసరించడమే.

 

మొదట్లో ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ మరియు ఒక పాటను వదిలిన తర్వాత అందరూ తమిళ వాళ్ళ సినిమాలు మన తెలుగు వారికి నచ్చవు అనవసరంగా రీమేక్ చేస్తుంటారు అని అనుకున్నారు కానీ సినిమా మాత్రం అడ్డంకిని అవలీలగా అధిగమించింది. అచ్చం 96 సినిమాలోని వాతావరణాన్ని రీ-క్రియేట్ చేయడం... గత కాలపు స్మృతులను గుర్తుకు తెచ్చేలా స్క్రీన్ ప్లే రాయడం…. ఇక నేపథ్య గాయం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలానే ఉంచేయడం సినిమాకు చాలా కలిసొచ్చింది.

 

ఇక పోతే చిత్రంలో కొన్ని ఐకానిక్ షాట్స్ ఉన్నాయి. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా పెట్టి తమిళంలో జరిగిన మ్యాజిక్ ను తెలుగు లో కూడా రిపీట్ చేశారు మన దర్శకుదు ప్రేమ్. అక్కడ కూడా ఆయనే సినిమా ను తీయడం వల్ల కథలోని అసలైన బలం ఇక్కడ బయటపడుతుందో అని ఆయనకు స్పష్టత ఉన్నందున చిత్రీకరణలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. కాబట్టే జాను చిత్రం సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: