బాలీవుడ్‌ తారలు కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో.. లేక వాళ్లు సరదాగా చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదమవుతాయో తెలీదు గానీ ఇటీవల ఉత్తరాది తారల కామెంట్స్ తరుచూ వివాదాస్పద మవుతున్నాయి. హీరో హీరోయిన్ల నుంచి సీనియర్‌ నటీనటుల వరకు ప్రతీ ఒక్కరు ఇలాంటి వివాదాల్లో తలదూరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పబ్లిక్‌ ఈవెంట్స్‌లో హాట్ కామెంట్స్‌ చేస్తూ న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు స్టార్స్‌. తాజాగా ఓ సీనియర్‌ నటి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.


కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం పంగా. ఈ సినిమాలో సీనియర్‌ నటి నీనా గుప్తా, కంగనా తల్లి పాత్రలో నటించింది. అశ్విని అయ్యర్‌ తివారి దర్శకత్వంలో ఫోక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. తాజాగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రముఖ టెలివిజన్‌ షో కపిల్ శర్మ టీవీ షోలో పాల్గొంది. ఈ షోలో కపిల్ అడిగిన ప్రశ్నకు హాట్ రిప్లయి ఇచ్చింది నీనా.


షోలో పాల్గొన్న నీనాను కపిల్‌.. బే వాచ్‌ సినిమాను బాలీవుడ్‌లో నిర్మిస్తున్నారట కదా ఆ సినిమాలో పమేలా అండర్సన్‌ పాత్రలో మీరు నటిస్తున్నారన్న వార్త నిజమేనా అంటూ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా పమేలాకు ఉన్నంత చాతి నాకులేదు. ఆ పాత్ర నేనెలా చేస్తా? అంటూ కామెంట్ చేసింది నీనా. ఆమె చెప్పిన సమాధానంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.


మోస్ట్ రేటెడ్‌ టీవీ షోలో అది కూడా ఆడవాళ్లు, పిల్లలు ప్రేక్షకులగా ఉన్న షోలో నీనా ఇలాంటి కామెంట్స్ చేయటంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సీనియర్‌ నటిగా ఈ జనరేషన్‌కు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి నాన్‌ వెజ్‌ మాటలేంటి అంటూ విమర్శిస్తున్నారు. కపిల్ శర్మ షోలో ఇలాంటి కామెంట్స్ కొత్తేం కాదు. ఇలాంటి వివాదాస్సద వ్యాఖ్యలతోనే ఆ షో అంత సక్సెస్‌ అయ్యింది. యంగ్ జనరేషన్‌ హీరో హీరోయిన్లు కూడా ఈ షో పచ్చిగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: