రాజమౌళి ‘ఈగ’ సినిమాను తీసి జాతీయ మీడియా దృష్టి ఆకర్షించే వరకు భారీ సినిమాల దర్శకుడు ఎవరు అంటే ఒక్క శంకర్ పేరు తప్ప మరెవ్వరికీ మరొక పేరు ఆలోచనలోకి వచ్చేది కాదు. ఇక ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ గా మారిపోయాడు రాజమౌళి. 


సామాజిక చైతన్యం ఉండే అంశాలతో సినిమాలు తీస్తూ దేశం గర్వించ దగ్గ దర్శకుడు స్థాయికి ఎదిగిన శంకర్ నుండి ‘జెంటిల్ మేన్’ ‘ఒకేక్కడు’ ‘భారతీయుడు’ ‘అపరిచితుడు’ ‘రోబో’ లాంటి అనేక సూపర్ హిట్స్ తీసినా శంకర్ ఎంతో శ్రద్ధ పెట్టి తీసిన ‘రోబో 2’ ఫెయిల్ కావడంతో అతడి క్రేజ్ ప్రస్తుతం మసక బారింది. అయితే మరింత రెట్టించిన ఉత్సాహంతో దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకులకు సవాల్ విసురుతూ శంకర్ తీస్తున్న ‘భారతీయుడు 2’ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కాబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


కమలహాసన్ 90 సంవత్సరాల వృద్ధుడు గా నటిస్తున్న ఈమూవీ గురించి చాల కష్టపడుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో రాబోతోంది అని వార్తలు రావడం ఒక విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఊహించని షాక్ అనుకోవాలి. 


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని కూడ తమిళనాడులో అదేవిధంగా హిందీతో పాటు అనేక భాషలలో విడుదల చేస్తున్నట్లుగానే శంకర్ ‘భారతీయుడు 2’ పాన్ ఇండియా మూవీగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి అన్ని విధాల రెడీ అవుతున్నాడు. దీనితో కేవలం వారం రోజుల గ్యాప్ లో రెండు అత్యంత భారీ సినిమాలు జాతీయ స్థాయిలో విడుదల కావడం హాట్ టాపిక్ గా మారబోతోంది. ‘బాహుబలి’ ఘన విజయం తరువాత తాను అటువంటి సినిమాను ఎందుకు తీయలేకపోయాను అని బాథ పడ్డాను అంటూ శంకర్ ఓపెన్ గానే చెప్పాడు. ఇప్పుడు ‘భారతీయుడు 2’ తో శంకర్ రాజమౌళి పై స్వీట్ రివెంజ్ తీర్చుకో బోతున్నాడా అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది..   

మరింత సమాచారం తెలుసుకోండి: