టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు అంటే ఇష్టపడని వారు ఉండరు.  ఈ హీరోలకు మాస్ ఇమేజ్ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.  టాలీవుడ్ లో స్వయంకృషితో అంచెలంచెలుగా పైకి వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  ఆయను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది హీరోలు స్వయంకృషితో పైకి వస్తున్నారు.  అలాంటి వారిలో హీరో శివాజీ ఒకరు.  ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న పాత్రల్లో నటించి తర్వాత హీరోగా మారారు శివాజీ.  కెరీర్ బిగినింగ్ లో జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా చేరాడు. అనుకోకుండా అక్కడే యాంకర్ గా మారి అందరి మనసు దోచాడు. కె. రాఘవేంద్ర రావు 2000 సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమా పరదేశి అనే సినిమా కోసం నూతన నటీనటుల కోసం స్టార్ 2000 కాంటెస్ట్ అనే ఒక పోటీలో పాల్గొన్నారు.  

 

డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు.  తర్వాత చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే సినిమా  తొలి అవకాశం వచ్చంది. ఆ తర్వాత సీతారాముల కల్యాణం చూతము రారండి అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర లో నటించారు. నిజజీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని ఎంతో గౌరవంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.  తన కెరియర్లో హీరోగా కొన్ని హిట్లు ఉన్నప్పటికీ, 'మిస్సమ్మ' చెప్పుకోదగినదిగా నిలిచింది.

 

ఇంతవరకూ 94 .. 95 సినిమాలు చేశాను. నేను అభిమానించే హీరో చిరంజీవి .. ఇప్పటి యువ హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం. రజనీకాంత్ తరువాత సౌత్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జునే అనేది నా అభిప్రాయం. నా నాలుకకి పవర్ వుంది .. నేను అన్నది జరుగుతుంది.   సావిత్రిగారంటే ఇష్టం. ఆ తరువాత సౌందర్య అంటే ఇష్టం. ఈ తరం నాయికలలో సాయిపల్లవిని ఎక్కువగా అభిమానిస్తాను.

మరింత సమాచారం తెలుసుకోండి: