ఒకప్పుడు దర్శకులు ఎవరి స్టైల్లో వారు సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలు అందుకునేవారు.  టాప్ సినిమాలు తీసినవారు సైతం కొన్ని సార్లు అట్టర్ ఫ్లాప్ మూవీస్ కూడా తెరకెక్కించే వారు.  కానీ ఈ తరంలో మొదటి సినిమా నుంచి విజయాలు అందుకుంటూ విజయేతనం ఎగురు వేస్తున్న దర్శకుల్లో ఇద్దరు మాత్రం అందరికీ భిన్నమనే చెప్పాలి.  తెలుగు లో దర్శకధీరుడు రాజమౌళి, తమిళంలో క్రియేటీవ్ డైరెక్టర్ శంకర్.  ఈ ఇద్దరు డైరెక్టర్లు తెరకెక్కించే సినిమాల్లో తప్పకుండా ఒక ప్రత్యేకత ఉంటుందని ఆడియన్స్ భావిస్తుంటారు.  కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా ఇద్దరు మంచి మెసేజ్ ఉన్న సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తుంటారు.

 

ముఖ్యంగా శంకర్ తీసే సినిమాల్లో సోషల్ మెసేజ్ తప్పకుండా ఉంటుంది.  అంతే కాదు ఈ ఇద్దరు కూడా స్టార్ హీరోలతోనే ఎక్కువ సినిమాలు తీశారు.  అయితే ఈ మద్య శంకర్ తీస్తున్న సినిమాలకు పెద్దగా ఆదరణ మాత్రం లభించడం లేదనే చెప్పాలి. విక్రమ్ తో ఐ సినిమా నాలుగేళ్లు కష్టపడితీశారు.  కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయింది.  ఇక రజినీకాంత్ 2.0  భారీ ఖర్చుతో తీశారు.. ఈ మూవీ కూడా అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది.  ఇక దర్శకధీరుడు విషయానికి వస్తే.. ఐదేళ్లు కష్టపడి బాహుబలి, బాహుబలి 2 తీశారు.   ఈ రెండు మూవీస్ జాతీయస్థాయిలో దుమ్మురేపాయి..కలెక్షన్ల సునామీ సృష్టించింది.  

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఇద్దరు డైరెక్టర్లు పెద్ద సినిమాలే తీస్తున్నారు. 2021లో సంక్రాంతికి రాజమౌళి వెర్సెస్ శంకర్ మధ్యన మొదటిసారిగా బాక్సాఫీసు యుద్ధం జరగబోతుందా..? రాజమౌళి మెగా బడ్జెట్ ఎంటర్టైనర్ 'ఆర్.ఆర్.ఆర్' జనవరి 8 న విడుదలకు డేట్ లాక్ చేసారు. ఒకప్పుడు సీనీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారతీయుడు మూవీకి   సీక్వెల్ అయిన శంకర్ - కమల్ హాసన్ఇండియన్ 2 జనవరి 14 న సంక్రాంతి కోసం థియేటర్లలోకి రానుంది. అంటే రాజమౌళి, శంకర్ చిత్రాలు ఆరు రోజుల వ్యవధిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. మరి ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్లే.. ఎవరి సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో.. ఎవరు గొప్పో తెలిసి పోతుందని అంటున్నారు ఆడియన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: