శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కిన చిత్రం 'జాను'. తమిళ్ సినిమా 96 రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది. టీజర్, ట్రైలర్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టేసింది అనే చెప్పాలి. 

 

తమిళంలోనే 96 సినిమా అద్భుతమైన రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. అక్కడ ప్రేక్షకులను ఆ సినిమా చూసిన ఇక్కడ ప్రేక్షకులను అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఆ కథ అద్బుతంగా ఉండటంతో ఇక్కడ కూడా సమంత, శర్వానంద్ తో సినిమాను తెరకెక్కించారు. అయితే జాను సినిమా అనేది బ్యూటిఫుల్ మోమెంట్స్ తో తయారు చేసిన మ్యాజికల్ లవ్ స్టోరీ.. 

 

సమంత, శర్వానంద్ లు తమ పర్ఫార్మన్స్ తో ఆ మ్యాజిక్ ని ఆడియన్స్ ఫీలయ్యేలా చేశారు. సెకండాఫ్ లో ప్రతి సీన్ లోనూ ఇద్దరు అద్భుతమైన నటన కనబరుస్తున్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మ‌న జీవితంలో స్కూల్‌, కాలేజ్ డేస్‌లో ఇలాంటి సీన్లు ఉన్న‌ట్టే ఉంటాయి. 

 

మన స్కూల్, కాలేజిలో మూమెంట్స్ అన్ని ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ సినిమా చూస్తే మన స్కూల్, కాలేజీ గుర్తులు అన్ని గుర్తొచ్చేస్తాయ్. సినిమాలో కుర్చున్నంతసేపు మనం మన స్కూల్, కాలేజీ డేస్ లోకి వెళ్ళొచ్చేస్తాం. అంత అద్భుతంగా ఉంది సినిమా. మ్యూజిక్ కూడా అదరగొట్టేసారు. ఇంకా సమంత, శర్వానంద్ నటన అయితే అదిరిపోయింది అనే చెప్పాలి. 

 

అలాంటి ఈ సినిమా కూడా ఓ అద్భుతం అనే చెప్పాలి. ఆడియన్స్ కు మంచి లవ్ ఫీల్ వచ్చేలా చేస్తున్నారు దర్శకులు. టోటల్ గా సినిమా అద్భుతం అనే చెప్పాలి. సినిమాకు వెళ్లిన ప్రతిఒక్కరు మంచి ఫీల్ తో బయటకు వస్తారు.. అంత బాగుంది సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: