ప్రేమకథల సినిమాల్లో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేమ అనుభూతిని మాటల్లో ఎంత చెప్పినా పాటలతో చెబితే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను సినిమాలో కూడా మ్యూజిక్ డైరక్టర్ గోవింద్ వసంత్ అలాంటి మ్యాజిక్ చేశాడు. సినిమాకు తగిన మూడ్ క్రియేట్ చేసేది సంగీతం. జాను సినిమాలో సంగీతమే ప్రధాన ఆకర్షణ అనేలా చేశాడు. ఊహలే ఊహలే సాంగ్ అయితే ఇక ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు.

 

సన్నివేశానికి తగినట్టుగా సంగీతం అలరించింది. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్టైన 96 మూవీ రీమేక్ గా వచ్చిన జానులో గోవింద్ వసంత్ మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎంత ప్లస్సో ఆడియెన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది. రాం, జానకి అలియాస్ జాను పాత్రలో సమంత ఇద్దరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫెయిల్యూర్ లవ్ స్టోరీని కూడా ఇంత అందంగా తెరకెక్కించిన దర్శకుడు ప్రేం కుమార్ కు మొదటి క్రెడిట్ ఇవ్వాల్సిందే.

 

ఇక ఈ సినిమాలో సమంత నటన ఆమెను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రేమలో ఉన్న అనుభూతి పొందుతూ వచ్చే అభినయాన్ని ఆమె చక్కగా పలికించారు. ఇక క్లైమాక్స్ లో శర్వానంద్, సమంతల నటనకు సంగీతం కూడా తోడై బరువెక్కిన హృదయాలతో ప్రేక్షకులు బయటకు వస్తారు. జాను సినిమా నటీనటులు ఎంత పర్ఫెక్ట్ గా చేశారో.. మ్యూజిక్ డైరక్టర్ గోవింద్ వసంత్ మెప్పించాడు. ఈ సంగీత దర్శకుడికి తెలుగులో కూడా మంచి ఫ్యూచర్ ఉండేలా ఉందనిపిస్తుంది. హృదయాన్ని తాకే సంగీతం విని చాలా రోజులవుతుందని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి గోవింద్ వసంత్ సాంగ్స్ బాగా నచ్చుతాయి. తమిళంలో ఆల్రెడీ సూపర్ ఫాం లో ఉన్న ఈ మ్యూజిక్ డైరక్టర్ కు తెలుగులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: