ప్రేమ కథలను తెరకెక్కించే దర్శకులు ముందు వారు రాసుకున్న కథకు న్యాయం చేసే స్టార్ కాస్ట్ ను ఎంచుకోవడమే. అక్కడ డైరక్టర్ యొక్క టేస్ట్ ఏంటన్నది తెలుస్తుంది. ఇక ఆల్రెడీ ఒక భాషలో సూపర్ హిట్టైన సినిమా రీమేక్ అంటే ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అందుకే 96 రీమేక్ రిలీజై చాలా రోజులు అవుతున్నా సరే ఆ సినిమా మొదలు పెట్టలేదు దిల్ రాజు. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో మొదటి నుండి కన్ ఫ్యూజన్ ఉండగా ఫైనల్ గా శర్వానంద్, సమంతలను ఓకే చేశారు. తమిళంలో సూపర్ హిట్టైన క్లాసిక్ మూవీ 96సినిమా తెలుగు రీమేక్ అనగానే ముందు అందరు రకరకాలుగా అనుకున్నారు.

 

అందుకే మాత్రుక దర్శకుడిని తెచ్చి ఇక్కడ డైరక్షన్ బాధ్యతలు ఇచ్చారు. ఫైనల్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను ప్రేక్షకుల ఆమోదం పొందిందని తెలుస్తుంది. ఇక శర్వానంద్, సమంతల జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనేలా ఉన్నారు. ఒకరికొకరు పోటీపడి మరి నటించారని అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగా శర్వానంద్ ను చూసి సమంత, సమంతను చూసి శర్వానంద్ అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమాలో వీరిద్దరు కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. 

 

ఇక సమంత ఒక పాత్ర చేస్తుంది అంటే అది కచ్చితంగా సూపర్ హిట్టే అనేలా ఆమె సినిమాలు ఉన్నాయి. మహానుభావుడు తర్వాత సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కు జాను మంచి సక్సెస్ ఇచ్చేలా ఉంది. ఈ సినిమాతోనే మొదటిసారి జతకట్టిన శర్వానంద్, సమంతలు అదరగొట్టేశారు. సినిమాకు వీరిద్దరు హైలెట్ అనిచెప్పొచ్చు. అయితే శర్వానంద్ కన్నా సమంత కొన్ని సీన్స్ లో డామినేట్ చేసిందన్నది వాస్తవం. ఫైనల్ గా శర్వా, సమంతల ప్రేమ కావ్యం జాను వాళ్ల లవ్ స్టోరీ ఫెయిల్ అయినా సినిమాను సక్సెస్ అయ్యేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: