శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’.  విజయ్ సేతుపతి, అందాల తార త్రిష జంటగా నటించిన 96 చిత్రం తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వ‌చ్చిన చిత్రం జాను. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్‌ను తెరకెక్కించారు.  ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ్ లో 96 గా విడుదల కాబడిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 

మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చే ప్రయత్నమే ఈ `జాను`. చైల్డ్ హుడ్ జానుగా గౌరీ గీత కిషన్ చేస్తే, యంగ్ జానుగా సమంత చేసింది. స్కూల్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ వెర్షన్ లానే తెలుగులో కూడా గౌరీ సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది. అలాగే స‌మంత, శ‌ర్వా మధ్య వచ్చే కొన్ని లవ్ ట్రాక్స్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు అయితే మంచి లవ్ జాన్రా సినిమాలను ఇష్టపడే వారికి ట్రీట్ లా ఉంటాయి. 

 

అంతలా వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సెటిల్ పెర్ఫార్మన్స్ తో, డైలాగ్స్ తక్కువైనప్పటికీ హావా భావాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గెట్ టుగెదర్ ఎపిసోడ్ లో సమంత శర్వాని కలిసే సీన్స్ లో సూపర్బ్ అనిపించే పెర్ఫార్మన్స్ చేసాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. ముఖ్యంగా  సమంత అద్భుతమైన నటన, స్పెషల్ గా కంటతడి పెట్టించే ప్రీ క్లైమాక్స్ లో సింప్లీ సూపర్బ్ అనిపించింది. అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషన్ లో కొత్త కోణాన్ని చూపించినా.. అది అలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. దీని మూలాన అక్కడక్కడా కాస్త బోర్ అనిపించొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: