పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న పవన్‌ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలు కూడా తన పొలిటికల్‌ కెరీర్‌కు ఉపయోగపడేలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాలను పట్టాలెక్కించిన పవర్‌ స్టార్‌ ఒకవైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. జెట్‌ స్పీడుతో షూటింగ్‌లు పూర్తి చేస్తున్నాడు.

 

రాజకీయాల కోసం సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్న పవన్‌.. సినిమాల కోసం రాజకీయాలకు మాత్రం బ్రేక్‌ ఇవ్వటం లేదు. రెండు పనులు ఒకేసారి చక్కబెట్టేస్తున్నాడు. ఇప్పటికే పింక్‌ రీమేక్‌ షూటింగ్ పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇన్నాళ్లు గుబురు గెడ్డంతో కనిపించిన పవన్, తదుపరి చిత్రం కోసం క్లీన్‌ షేవ్‌ లుక్‌లోకి వచ్చేశాడు. గురువారం జరిగిన పార్టీ కార్యక్రమంలో కొత్త లుక్‌లో కనిపించి షాక్‌ ఇచ్చాడు పవర్‌ స్టార్‌.

 

అంతేకాదు పవన్‌ చేతిమీద ఓ టాటూ కూడా ఆసక్తికరం చర్చకు కారణమైంది. పవన్‌ కుడి చేతి మీద త్రిశూళం, డమరుకంలు ఉన్న టాటూ ఒక్కటి కొత్తగా కనిపిస్తుంది. ఈ టాటూ పవన్ సినిమా కోసం వేయించుకున్నాడా..? లేక తన పర్సనల్‌ ఇంట్రస్టట్‌తో వేయించుకున్నాడా..? అన్న చర్చ మొదలైంది. పింక్ రీమేక్‌తో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్‌. ఈ సినిమాలో పవన్‌ బందిపోటు దొంగగా కనిపించనున్నాడట.

 

రాబిన్‌ హుడ్‌ తరహా పాత్రతో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్‌లో రూపొందుతుందని తెలుస్తోంది. పవన్ క్లీన్‌ షేవ్‌ లుక్‌ కూడా ఈ సినిమా కోసం అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. క్రిష్ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నాడు పవన్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌ సింగ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలవటంతో ఈ మూవీపై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: