అక్కినేని సమంత, యువ నటుడు శర్వానంద్ ల కలయికలో తెరకెక్కిన తాజా సినిమా జాను. యువ దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఇప్పటికే తమిళ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన 96 అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందిన ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పై మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. కొన్నేళ్ల క్రితం స్కూల్ లో చదివేటపుడు ఒకరినొకరు ఇష్టపడిన యువ జంట, ఆ సమయంలో పరిస్థితుల ప్రభావం వలన విడిపోతారు. 

 

అయితే మళ్ళి కొన్నేళ్ల తరువాత ఒకానొక సందర్భంలో అప్పటి బ్యాక్ మొత్తం ఒక అపూర్వ కలయిక ద్వారా కలుసుకోవడం, ఇక అదే సినిమాలో ఆ ఇద్దరు విడిపోయిన ప్రేమికులు ఒక్కసారిగా కలుసుకోవడం, అప్పటికే ఎవరి జీవిత పయనంలో వారు మునిగిపోయి ముందుకు నడుస్తున్నా, గడిచిన ఆ నాటి లేత వయసు ప్రేమకు గుర్తు చేసుకోవడం వంటి సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. జాను రెండున్నర గంటలపాటు మనల్ని మన 15వ సంవత్సరానికి తీసుకెళ్లి, మన హృదయాంతరాల్లో భద్రపరుచుకున్న తొలిప్రేమని గుర్తు చేస్తుంది. 

 

ఆ విధంగా మనలోని తొలి ప్రేమ మనకు గుర్తు రావాల్సిందే అనే చెప్పాలి. ఇక సమంత, శర్వా ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించారని, తమిళ వర్షన్ మాదిరిగా ఈ తెలుగు వర్షన్ కూడా ఎక్కడా పెద్దగా బోర్ లేకుండా ముందుకు సాగిందని, ఆ విధంగా సినిమాని తెరకెక్కించిన దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కు చాలానే మార్కులు పడతాయని అంటున్నారు ప్రేక్షకులు. మొత్తంగా మంచి సక్సెస్ టాక్ ని సంపాదించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: