స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా స్టలిష్ గానే ఉంటుంది. ప్రతి సినిమాకు లుక్ సైతం మార్చేసి తనను తాను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకుంటాడు. కొత్త కారు దగ్గర నుంచీ కారవాన్, ఇల్లు, డిజైనింగ్, పర్సనల్ స్టాఫ్.. ఇలా చెప్పుకుంటూ పోతే బన్నీ స్టైలే వేరు. టాలీవుడ్ లో తనను తాను ఓ స్టైలిష్ పర్సన్ గా తీర్చిదిద్దుకుంటున్నాడు. రీసెంట్ గా అల.. వైకుంఠపురముతో సినిమాలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ ప్రమోషన్స్ కూడా అంతే బిగ్గర్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

 

 

కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హెట్ కొట్టడం.. అది కూడా సొంత నిర్మాణ సంస్థ భాగస్వామి కావడంతో బన్నీ ఎక్కడా తగ్గలేదు. గతేడాది దసరాకు మొదలుపెట్టిన ప్రమోషన్ల దగ్గర నుంచి మొన్న టాలీవుడ్ దర్శకులకు ఇచ్చిన పార్టీ వరకూ మొత్తం బన్నీనే సోలోగా ప్రెజెంట్ చేసుకున్నాడు. ప్రతి ఈవెంట్లో తనదైన మార్క్ ఉండేలా కేర్ తీసుకున్నాడు. ఈవెంట్లకు, ప్రమోషన్లకు, పార్టీలకు మొత్తంగా బన్నీ ఆరు కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాకు ముందు వరకూ చేసిన ప్రమోషన్లు ఒకెత్తైతే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ వచ్చాక చేసిన ప్రమోషన్లు మరొక ఎత్తు. ఎక్కడా అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా బన్నీనే మొత్తం చూసుకుని సినిమాను ప్రమోట్ చేసుకుని ఇండస్ట్రీ హిట్ కలను సాకారం చేసుకున్నాడు.

 

 

ఎంత పెద్ద హిట్ అయినా ఆరు కోట్లు అనే ఫిగర్ చాలా పెద్దదే. ప్రెస్ మీట్లకు ఇతర భాషల మీడియాను కూడా సొంతంగానే ఫ్టైల్ టికెట్స్ బుక్ చేసి మరీ రప్పించాడని వార్తలు వస్తున్నాయి. నిర్మాత రాధాకృష్ణ కూడా బన్నీ కోరికలను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసిపెట్టాడట. మరో సినిమా చేస్తానని బన్నీ కూడా మాటిచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: