తమిళంలో సూపర్ హిట్ మూవీ అయినా 96 తెలుగు రీమేక్ గా వచ్చిన చిత్రం జాను. తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష ఇద్దరు 96 మూవీ లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరి మనసును తాకేలా ఉండే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులో రీమేక్ అయి జానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో శర్వానంద్ సమంత జంటగా నటించారు. ఇక ఈ సినిమా నేడు భారీ అంచనాల మధ్య విడుదలైనది . ఈ సినిమాలో సమంత శర్వానంద్ తమ నటనతో అదరగొట్టారు అనే చెప్పాలి. అయితే ఈ సినిమాని తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు తెలుగులోనూ తెరకెక్కించడం తో ఎలాంటి మార్పులు చేయకుండా తమిళ సినిమాను పోలినట్లుగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాలో ఫీల్ ఎక్కడా మిస్ కాలేదు ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల మదిని తాకుతుంది. 

 


 స్కూల్ డేస్లో ప్రేమించిన అమ్మాయి తర్వాత పెరిగి పెద్దయి మిడిల్ ఏజ్ వచ్చాక కలిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం... అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో లవ్ ఫీల్ ఎక్కడా కాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ సమంత నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. వీరిద్దరి నటన సినిమాకు వెన్నెముక నిలిచింది . ఇక వీరిద్దరి నటనతో పాటు ఈ సినిమాలో పాటలు కూడా ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు లవ్ ఫీల్ లోకి తీసుకు వెళ్తూ ఉంటాయి. 

 

 ఇక ఈ సినిమాలోని ప్రతి షాట్ లో  ఎమోషనల్ టచ్ తో ఉన్న నేపథ్య సంగీతాన్ని అందించి అద్భుతంగా ప్రేక్షకులను మెప్పించాడు సంగీత దర్శకుడు. ఈ సినిమాలోని మ్యూజిక్ సినిమాలోని పాత్రలకు ప్రాణం పోసిందని అని చెప్పాలి. సినిమాలో  ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ కూడా చెప్పుకోదగ్గ విధంగానే ఉంది. అయితే సినిమా నరేషన్  కాస్త స్లో అనిపించింది. కాస్త కట్ చేయొచ్చు కదా అని అనిపించినప్పటికీ... ఇలాంటి ఫీల్ గుడ్ కథల్లో మధ్య మధ్యలో కట్ చేస్తేనే ఫీల్ మిస్ అయిపోతాం. అందుకే స్లో స్లో అనిపించిన ఎడిట్ గుడ్ అనే చెప్పాలి. అంటే జాను సినిమా  తెరవెనుక హీరో ప్రవీణ్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: