రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి8న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ నుంచి భారీ తారాగణం నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ పారితోషికంపై ఇప్పుడు ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

 

 

ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ అరగంట నిడివి గల పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటివలే ఈ సినిమా షూటింగ్ లో అజయ్ పాల్గొన్నాడు. సినిమాలో అత్యంత కీలకమైన ఈ పాత్ర కోసం అజయ్ దేవ్ గన్ 25కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు అప్పట్లోనే వర్తలు వచ్చాయి. అయితే.. అజయ్ దేవ్ గన్ ఎటువంటి పారితోషికం తీసుకోలేదనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. నిర్మాత, దర్శకుడు పెద్ద మొత్తమే ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించాడని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో నటిండం ఓ గౌరవంగా ఫీల్ అయి రెమ్యునరేషన్ వద్దంటున్నాడని ఫిలిం నగర్ టాక్. అజయ్ కోసం సినిమా రిలీజ్ తర్వాత భారీ గిఫ్ట్ ఇచ్చే యోచనలో నిర్మాత ఉన్నాడని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.

 

 

ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉన్న అంచనాలు ప్రస్తుతం మరే ఇండియన్ సినిమాపై లేవనేది వాస్తవం. ఇప్పటికే బిజినెస్ పరంగా, క్రేజ్ పరంగా ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. కనివినీ ఎరుగని బిజినెస్ జరుగుతోందని సమాచారం. రిలీజ్ కు ఇంకా పదకొండు నెలల సమయముండగానే ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాపై మరెన్ని సంచలన వార్తలు వస్తాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: