శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని హీరోయిన్ గా ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రం `జాను`. తమిళంలో సూపర్ హిట్ అయిన '96' ను తెలుగులో జాను పేరుతో తెరకెక్కించారు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. అక్క‌డ ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఆ తమిళ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. టీజర్లు, ట్రైలర్లు యూత్‌ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

తమిళ మాతృక '96' కు ఎటువంటి మార్పులూ చేయకుండా అలానే తీసేశాడు ద‌ర్శ‌కుడు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. మ‌రియు రివ్యూలు కూడా జాను సినిమాకు పాసిటివ్‌గానే వ‌స్తున్నాయి. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. శర్వానంద్ కూడా రామ్ పాత్రని చాలా బాగా చేసాడు. సెటిల్ పెర్ఫార్మన్స్ తో, డైలాగ్స్ తక్కువైనప్పటికీ హావా భావాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గెట్ టుగెదర్ ఎపిసోడ్ లో సమంత శర్వాని కలిసే సీన్స్ లో సూపర్బ్ అనిపించే పెర్ఫార్మన్స్ చేసాడు. చైల్డ్ రామ్ గా చేసి సాయి కిరణ్ కూడా ఫెంటాస్టిక్ అనేలా చేసాడు. 

 

ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఎపిసోడ్ చేసిన నటులు గౌరీ, సాయి కిరణ్ లు లీడ్ పెయిర్ అయిన సమంత, శర్వానంద్ లు దగ్గరగా ఉండడం వలన తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. 90% సినిమా ఈ నలుగురి మీదే ఉంటుంది. మిగతా నటీనటుల్లో వెన్నెల కిషోర్, శరణ్య ప్రదీప్, రఘుబాబులు కూసింత నవ్వులు పంచారు. అలాగే వర్ష బొల్లమ్మ ఉన్న సీన్స్ రెండు మూడైనా నటనతో మెప్పించింది. ఆన్ స్క్రీన్ పరంగా కనపడిన ప్రతి ఒక్కరూ నటన పరంగా ది బెస్ట్ ఇచ్చారు.  మొత్తంగా చెప్పాలంటే జాను ఓ ఫీల్ గుడ్ మూవీ అని చెప్ప‌వ‌చ్చు. ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఎక్స్‌ప్రెష‌న్స్ కోస‌మైనా సినిమా చూడాల్సిందే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: