త‌మిళ్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన `96` మూవీ తెలుగులో జానుగా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి హిట్ టాక్‌ని సంపాదించుకుంది. త‌మిళ్ లో త్రిష‌, విజ‌య్ సేతుప‌తి న‌టించ‌గా,  ఇక తెలుగులో శ‌ర్వానంద్‌, స‌మంత‌లు న‌టించారు. ట్రావెలింగ్ ఫోటోగ్రాఫర్‌గా ప్రకృతిని ఆస్వాధిస్తూ తిరుగుతున్న రామ్‌ చంద్రన్ (శ‌ర్వానంద్‌)తో కథ మొదలవుతుంది. ఫోటోగ్రఫీ పాఠాలు చెప్పడం, ఆ స్టూడెంట్స్‌ సరదా సన్నివేశాలతో కథ ముందుకు సాగుతూ ఉంటుంది. రామ్ ఎప్పుడైతే తన బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడో కథ అక్కడ ఆసక్తికరంగా మారుతుంది. ఫస్టాప్ మొత్తం దాదాపుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో డైరెక్ట‌ర్ బాగా ఆక‌ట్టుకున్నాడ‌నే చెప్పాలి. ఆ సీన్స్ అన్నీ కూడా గతంలోకి తీసుకెళ్లేలానే ఉంటాయి. 

 

సినిమా చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి ఒక‌సారి వారి స్కూల్ డేస్ గుర్తు రావ‌డం ఖాయం. అంత సూప‌ర్బ్‌గా ఉంటుంది ఈ మూవీ. ప్ర‌తి సీన్ ఎంతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యేలా చేశాడు ద‌ర్శ‌కుడు. ఇది వరకు ఎన్నో సినిమాలో స్కూల్ ఏజ్ లవ్ స్టోరీస్ చూసినా.. కూడా జాను మరోసారి మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తుంది. గెట్ టుగేదర్ పార్టీ, పాత స్నేహితులు కలుసుకోవడం, జోకులు, సరదా సన్నివేశాలతో అలా ప్రేక్షకులను కట్టిపడేయడంలో ప్రథమార్థం విజయవంతమైందని చెప్పవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు వారి వారి స్కూల్ లైఫ్ గుర్తురాని వారంటూ ఎవ్వ‌రూ ఉండ‌రు. అలాగే సినిమా చివ‌రి ఆఖ‌రి సీన్ కూడా ఎంతో క‌నెక్ట్‌విటీగా ఉంటుంది. ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి కంట త‌డి పెట్టించే సీన్ అని చెప్ప‌వ‌చ్చు. 

 


దర్శకుడు ప్రేమ్ కుమార్ ‘జాను’ కోసం చాలా సెన్సిబుల్ పాయింట్ ని ఓ అందమైన కావ్యంలా రాసాడు. ఆ కావ్యాన్ని దృశ్య కావ్యంలా మార్చింది మాత్రం సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజ్ అనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ లో ఓ ఫీల్ కనపడేలా, అదే మనకు చెబుతుంది అనే ఫీల్ ని క్రియేట్ చేశాయి. ఇక ఈయన విజువల్స్ కి మనసుకు హత్తుకొని, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఫీలింగ్ కలుగ జేసింది మాత్రం గోవింద్ వసంత మ్యూజిక్.  అలాగే స్టార్టింగ్ శ‌ర్వానంద్ ఫొటోగ్ర‌ఫీ సీన్స్‌లో డిఒపి ప‌ని త‌నం గురించి తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: