ఒక్కో సినిమా ప్రేక్ష‌కుడిని ఒక్కో విధంగా ఆక‌ట్టుకుంటుంది. కొన్ని కామెడీతో ఆక‌ట్టుకుంటే కొన్ని సెంటిమెంట్‌గా ఆక‌ట్టుకుంటాయి. మ‌రి కొన్ని హార‌ర్ చిత్రాలు బావుంటాయి. మ‌రి కొన్ని డిటెక్టివ్ టైప్ ఉంటాయి. మ‌రి స‌మంత శ‌ర్వానంద్ న‌టించిన జాను చిత్రం ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమాకి కీలకం జాను పాత్రే అని.. చైల్డ్ హుడ్ జానుగా గౌరీ గీత కిషన్ చేస్తే, యంగ్ జానుగా సమంత చేసింది. స్కూల్ ఎపిసోడ్స్ లో ఒరిజినల్ వెర్షన్ లానే తెలుగులో కూడా గౌరీ సూపర్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసింది. చైల్డ్ ఎపిసోడ్ ని పక్కన పెడితే మిగతా అంతా సమంత సోలోగా క్రెడిట్ కొట్టేసింది. సమంత చుట్టూ తిరిగే కథ కావడంతో ప్రతి సీన్ లో అద్భుతమైన నటనతో ఆడియన్స్ తన నుంచి చూపు పక్కకి తిప్పుకోకుండా చేసింది. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్, చూస్తున్న అందరి కళ్ళు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. 

 

ఆ కన్నీటికి సగం కారణం సమంత అయితే, సగం కారణం మీ గుండె లోతుల్లో దాగిఉన్న తొలిప్రేమ అనుభూతుల్ని గుర్తొచ్చేలా చేయడమే. ఓవరాల్ జాను పాత్ర, జానుగా సమంత మనల్ని కట్టి పడేస్తారు. స్పెష‌ల్ పాత్ర‌ల్లో సమంత ఆక‌ట్టుకున్న‌ట్లు మ‌రే క‌థానాయిక ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌లేదు. స‌మంత ఎమోష‌న‌ల్‌గా అంత క‌నెక్ట్ అయ్యేలాగా చేసింది.  సినిమా మొత్తంలో ఎక్క‌డా కూడా వ‌ల్గారిటీ అనేది లేకుండా క‌థ ప‌రంగా ఇంత‌లా ఆక‌ట్టుకున్న చిత్రం ఈ మ‌ధ్య కాలంలో జానునే అని చెప్ప‌వ‌చ్చు. 

 

ఫ‌స్టాఫ్‌ ఎంత ఫీల్‌తో ప్రేక్ష‌కుల గుండెల‌ను ద‌ర్శ‌కుడు నింపేస్తాడో.. సెకండాఫ్‌ను అంతకు మించి ఎమోషన్స్‌తో నడిపించేశారు. సెకండాఫ్‌లోని అన్ని సీన్లు దాదాపు శర్వానంద్, సమంత మధ్యే వస్తాయి. ఈ ఇద్దరితోనే గంటకు పైగా నడిపించాడు. గతాన్ని గుర్తుకు చేసుకోవడం, సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం లాంటి సీన్స్‌తో సెకండాఫ్ అంతా న‌డ‌ప‌డం అన్న‌ది చాలా గ్రేట్‌. అయితే అవి ఎక్కడా కూడా బోర్ కొట్టించకపోవడం ప్లస్. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఒకే ఫీల్‌ను మెయింటేన్ చేయడంతో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. అలాగే ఈ చిత్రం చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడి గుండెలోతుల్లో దాగి ఉన్న తొలిప్రేమ గుర్తుకు రావ‌డం ఖాయం. ఇలా సినిమా ముగిసే సరిగి భారమైన హృదయంలో ప్రేక్షకులు బయటకు వచ్చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: