టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.  ఈ చిత్రం ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో అంచనాలను పెంచేస్తుంది. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం... ఈ సినిమాలో టాలివుడ్ టాప్ స్టార్స్  నటిస్తుండటంతో ఈ సినిమా మరింత హైప్ ను పెంచుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఇక రాజమౌళి సినిమా అంటే... భారీ బడ్జెట్ ఏ కాదు... భారీ  బిజినెస్ కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎన్ని కోట్లు పెట్టి అయినా సినిమా కొనడానికి ముందుకు వస్తూ ఉంటారు. 

 


 ఎందుకంటే... రాజమౌళిసినిమా తీసినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఏ హీరోతో  తీసిన అది సెన్సేషనల్ హిట్ అవుతూ ఉంటుంది. అందుకే రాజమౌళి సినిమా అంటే ఎలాగో సెన్సేషన్ హిట్ సాధిస్తుంది  కాబట్టి... బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఓటర్లు పోటీపడి మరీ రాజమౌళి సినిమా రైట్స్ ను  దక్కించుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్  సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీగా బిజినెస్ మొదలైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తంగా ఆర్ఆర్ఆర్  సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు నుంచి భారీ డిమాండ్ వస్తోంది. మొత్తంగా రాజమౌళి సినిమా రైట్స్ ని సొంతం తీసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతుండగా ఇప్పటికే 225 కోట్ల డీల్ జరిగినట్లు సమాచారం. 

 


 నైజాంలో 75 కోట్లకు నిర్మాత దిల్ రాజు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా... ఆంధ్ర  రీజియన్  హక్కులను 100 కోట్లకు ప్రవీణ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ రేటు ప్రకారం సీడెడ్  హక్కులు 50 కోట్లు సులభంగానే సాధిస్తుందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రలు  రెండిట్లో ఏకంగా రెండు వందల ఇరవై ఐదు కోట్లకు ఆర్.ఆర్.ఆర్ మూవీ అమ్ముడు పోవడం ఖాయమని... బాహుబలి2 కంటే 20 కోట్లు ఎక్కువగానే ఈ ఆర్ఆర్ఆర్  సినిమా అమ్ముడు పోతుంది ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. చూడాలి మరి ప్రస్తుతం జక్కన  తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్  సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: