టాలీవుడ్ లో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు యంగ్ స్టర్స్ రింగులతో సిద్ధమైపోయారు. బ్యాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేస్తూ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ వాలెంటైన్ సీజన్ తో మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్ కుర్రాళ్లు సింగిల్ స్టేటస్ కు ఎండ్ కార్డ్ వేసి రిలేషన్ లోకి వెళ్లేందుకు రింగులతో సిద్ధమైపోయారు. రీసెంట్ గానే నిఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ కు రింగ్ తొడిగాడు. లవర్ పల్లవి వర్మతో కలిసి లైఫ్ షేర్ చేసుకునేందుకు ప్రిపేర్ అయిపోయాడు. ఏప్రిల్ లో వీళ్లిద్దరి పెళ్లి జరుగబోతోంది. 

 

లవర్ బాయ్ క్యారెక్టర్స్ తో సందడి చేస్తోన్న నితిన్, ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్నాడు. లవ్ కమ్ ఎరేంజ్ మ్యారేజ్ తో బాచిలర్ లైఫ్ కు శుభం కార్డు వేయబోతున్నాడు. గర్ల్ ఫ్రెండ్ షాలినీతో ఏడడుగులు వేయబోతున్నాడు నితిన్. ఏప్రిల్ 15న దుబాయ్ లో నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడని సమాచారం. 

 

నితిన్, నిఖిల్ లాంటి హీరోలు పెళ్లికి రెడీ అయిపోయారు. కానీ నలభైల్లో ఉన్న ప్రభాస్ ఇంకా సింగిల్ స్టేటస్ నే కంటిన్యూ చేస్తున్నాడు. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న పెళ్లి మాటను పక్కన పెట్టి సినిమాలతో బిజీ అవుతున్నాడు. 

 

ప్రభాస్ పెళ్లి గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. బాహుబలి నుంచి మొదలుపెడితే.. జాస్ వరకు ఈ డిస్కషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ డార్లింగ్ మాత్రం సింగిల్ స్టేటస్ తోనే సాహసం చేస్తున్నాడు. సాహో థియేటర్ల నుంచి వెళ్లిపోయి కూడా చాలా కాలం అవుతోంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ మేకోవర్ పై ఫోకస్ పెట్టి, కొత్త లుక్ ట్రై చేశాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ కూడా స్పీడందుకుంది. కానీ ప్రభాస్ పెళ్లి వ్యవహారం మాత్రం ఇంకా డబ్బాల్లో ఇరుక్కుపోయిన సినిమాలా తయారైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: