సినిమా ఇంత వసూలు చేసింది అంటే అది హీరో ఖాతాలోకి మాత్రమే వెళ్తుంది. కానీ.. ఓ హీరోయిన్ నటించిన సినిమాల కలెక్షన్లు ఇన్ని ఉన్నాయి అని ఎవరూ చెప్పుకోరు. మహా అయితే ఇండస్ట్రీలోని ట్రేడ్ సర్కిల్స్ లెక్కలు వేస్తే తప్ప. ఇప్పుడు అలాంటి అరుదైన సంఘటనే జరిగింది. బాలీవుడ్ హాట్ హీరోయిన్ సొనాక్షి సిన్హా నటించిన సినిమాల కలెక్షన్లు 1500కోట్లు దాటాయనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

 

బాలీవుడ్ లో 2010లో వచ్చిన దబాంగ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సొనాక్షి సిన్హా గోల్డెన్ లెగ్ లా మారింది. ఇప్పటి వరకూ ఆమె నటించిన సినిమాల్లో ల్యాండ్ మార్క్ హిట్లు సాధించి 1500 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి సినిమానే 141.25 కోట్లు పైగా వసూలు చేసింది. తర్వాత చేసిన సినిమాల్లో రౌడీ రాధోడ్ 133.25 కోట్లు, సన్ ఆఫ్ సర్దార్ 105.03 కోట్లు, దబాంగ్-2 155 కోట్లు, హాలిడే 112.45 కోట్లు, ఇత్లేఫాక్ 30.19 కోట్లు, మిషన్ మంగళ్ 208.05 కోట్లు వసూలు చేశాయి.  

 

 

దీనిపై ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందిస్తూ.. ‘దేవుడు నాకిచ్చిన ఆర్ట్ ను మొత్తం సినిమాల్లో పెట్టాను. ప్రతి రోజు నా వర్క్ ముందు రోజు కంటే ఇంకా బాగుండాలనే శ్రమించాను. అదే ఈరోజు నన్ను తలెత్తుకునేలా చేసింది. ఎటువంటి రికమండేషన్లు, అవార్డులు కంటే.. హార్డ్ వర్క్ ను మించింది మరేదీ లేదని ఈ కలెక్షన్లు నిరూపిస్తున్నాయి. నా పని మాత్రమే మాట్లాడాలని తపించాను. నా పనితనం గురించి ఎన్నో మాటలు వచ్చినా అవే నన్ను మరింత బలంగా ముందుకు నడిపించాయి. అభిమానుల ప్రేమ ముందు ఈ అంకెలన్నీ నాకు కనిపించవు. అదే అసలైన బంగారం’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: