స్టార్ వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టినా.. ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయిన బ్యూటీ సోనమ్ కపూర్‌. నటిగా మంచి మార్కులు సాధించినా సక్సెస్‌ల పరంగా మాత్రం ఈ భామ చాలా వెనకపడిందనే  చెప్పాలి. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే తన స్టైల్‌, డ్రెసింగ్ కారణంగా ఈ భామ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. బోల్డ్‌ డ్రెసింగ్‌తో పబ్లిక్‌ ఈవెంట్స్‌కు హాజరయ్యే సోనమ్ మరోసారి ట్రోల్స్‌ బారిన పడింది. అది కూడా తండ్రితో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరైన సోనమ్‌ను టార్గెట్‌ చేస్తూ నెటిజెన్లు తెగ విమర్శలు చేస్తున్నారు.


సోనమ్‌ సీనియర్‌ హీరో అనిల్ కపూర్‌ కూతురన్న విషయం తెలిసిందే. అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలంగ్ సినిమా ప్రీమియర్‌కు తండ్రితో కలిసి సోనమ్‌ హాజరైంది. ఈ వేడుకలో ఆమె వేసుకున్న డ్రెస్‌ విమర్శలకు కారణమైంది. బ్లాక్‌ కలర్‌ గౌనులో వచ్చిన సోనమ్‌, అక్కడున్నవారిని చూపుతిప్పుకోనివ్వకుండా చేసింది. ఎద భాగం దాదాపు సగం వరకు బయటకు కనిపించేలా ఆమె డ్రెస్‌ వేసుకోవటంతో అంతా షాక్‌ అయ్యారు.

 

అది కూడా తండ్రి అనిల్‌ కపూర్‌ పక్కనే ఉండగా అలాంటి డ్రెస్‌ వేసుకోవటంపై నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రెడ్‌ కార్పెట్‌పై సోనమ్ ఇచ్చిన ఫోజులు నెట్‌లో వైరల్ కావటంతో తీవ్ర పదజాలంతో ట్రోల్స్‌ చేస్తున్నారు. కొంత మంది హద్దులు దాటి అభ్యంతరకర భాషలో కామెంట్స్ పెడుతున్నారు. కనీసం తండ్రి పక్కన ఉన్నప్పుడైనా కాస్త మంచి బట్టలు వేసుకో అంటూ సోనమ్‌కు క్లాస్ పీకుతున్నారు.

 

అయితే సోనమ్‌కు ఇలాంటి ట్రోల్స్‌ కొత్తేం కాదు. గతంలోనూ ఆమె డ్రెసింగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. అయితే అలాంటి ట్రోల్స్‌ను తాను పట్టించుకోనని తనకు ఏది బాగుందనిపిస్తే ఆ డ్రెస్‌ వేసుకుంటానని కరాఖండిగా చెప్పేసింది ఈ భామ. అయితే స్టైల్‌ విషయంలో సోనమ్‌ది స్పెషల్ స్టైల్‌, సొంతంగా తన చెల్లితో కలిసి ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న సోనమ్‌, అందరిలోనూ తాను స్పెషల్‌గా కనిపించేందుకు తాపత్రేయ పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: