టాలీవూడ్ లో ఆరడుగుల అందగాడు, అభిమానులు డార్లింగ్ అని ప్రేమతో పిలుచుకునే ఒకే ఒక్క నటుడు ప్రభాస్. అయితే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరో సల్మాన్ ని వెంటాడుతున్నాడు అనే ఊహాగానాలు ఎక్కువగా వినపడుతున్నాయి. దీనికి కారణాలు సినిమా టైటిల్ ఫైనల్ కాలేదని ఇదివరకూ రివీలైంది. అయితే ప్రస్తుతం ఫిలింఛాంబర్ లో ప్రభాస్ 20 వ మూవీ కోసం వేరే రెండు టైటిల్స్ ని రిజిస్టర్ చేశారు. రాధేశ్వామ్, ఓడియర్ అనే రెండు టైటిళ్లను నిర్మాత దిల్ రాజు రిజిస్టర్ చేయించారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలన్నది టీం ప్లాన్.

 

 

అయితే ఇప్పుడు ఆ రెండిటిలోనూ ఒకదానిని ఫైనల్ చేసేశారట. అది `రాధే శ్యామ్` అని ఖరాకండిగానే తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి సడెన్ గా ఎందుకు ఈ టైటిల్ మార్పు? జాన్ టైటిల్ బావున్నా రాధే శ్యామ్ అనేదే ఎందుకు ఫైనల్ చేశారు? అంటే.. దానికి ఓ ప్రత్యేక కారణం కనిపిస్తోంది. ఇప్పటికే సల్మాన్ భాయ్ నటిస్తున్న `రాధే` ఆన్ సెట్స్ ఉంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. భాయ్ క్రేజు తో రాధే ఇప్పటికే ఉత్తరాది జనాల్లోకి వైరల్ గా వెళ్లి పోయింది.

 

 

ప్రభాస్ 20 వ మూవీ కోసం రాధే శ్యామ్ అని పెట్టుకుంటే ఉత్తరాది ఆడియెన్ కి వెంటనే కనెక్టయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందుకే డార్లింగ్ టైటిల్ ని మార్చేశారన్న గుసగుస వినిపిస్తోంది. ఇక సాహో చిత్రం ఉత్తరాదిన బంపర్ హిట్ కొట్టింది. అందుకే జాన్ అనే టైటిల్ కంటే రాధే శ్యామ్ వైపే ప్రభాస్, దిల్ రాజు, రాధా కృష్ణ బృందం మొగ్గు చూపిస్తున్నారని ప్రచారమవుతోంది. సల్మాన్ "రాధే" 2020లో రిలీజ్ కానుంది. అలాగే ప్రభాస్ రాధే శ్యామ్ ఈ ఏడాది లోనే రిలీజ్ ని ఫిక్స్ చేయనున్నారు. అయినా ఇది ప్రభాస్ కి కలిసొచ్చే అంశమేనని చిత్ర బృందం అనుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: