టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  స్వయంకృషితో పైకి వచ్చిన ఆయన ఇంటి నుంచి ఇప్పటికే కొంత మంది హీరోలు టాలీవుడ్ లో మంచి స్థానం సంపాదించారు.  ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని రోల్ మోడల్ గా తీసుకొని కెరీర్ ప్రారంభించామని చెబుతుంటారు.  ఇక   తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని  మెగాస్టార్ చిరంజీవి, అగ్రహీరో నాగార్జునలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవిని నంది అవార్డ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవిని నంది అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తే తాను ఊరుకోనని అంటున్నారు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.

 

కాగా, తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని.. అభివృద్దికి కృషి చేయాలని వారు కోరారు.  అయితే చిరంజీవికి నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని కొంతకాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయని, కానీ చిరంజీవి స్థాయికి ఆ పదవి చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. అలాంటి  చైర్మన్ పదవుల్లో ఖాళీగా ఉన్నవాళ్లే ఉంటారని, చిరంజీవి ఎంతో బిజీగా ఉండే వ్యక్తి అని తెలిపారు. అంతేకాదు, ఏదైనా సమస్య వస్తే దాన్ని చిరంజీవిపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతాయని భరద్వాజ అభిప్రాయపడ్డారు. 

 

సీని పరిశ్రమ మాత్రమే కాదు.. ఇక్కడ చేసే ప్రతి ఒక్కరి బాధ్యత ఆయన తీసుకునే సమయం వస్తుంది.. అందరికీ పెద్దగా ఉండాల్సిన బాధ్యత మెగాస్టార్ కి ఉంటుంది.  ఈరోజు చిత్ర పరిశ్రమ కోసం ఏదైనా చేయగలిగే స్థాయిలో చిరంజీవి ఉన్నారు. అలాంటి ఆయన్ను పిలిచి ఏదన్నా పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఆయనకు అలాంటి పదవుల్లో ఉండే సమయం కూడ ఉండదని భావిస్తున్నా అన్నారు. ఇప్పటికిప్పుడు చిరంజీవి ఏదైనా చేయగలిగే సుప్రీం స్థాయిలో ఉన్నారని, అలాంటి వ్యక్తికి పదవితో పనిలేదని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: