టాలీవుడ్ లోకి అష్టాచమ్మ సినిమాతో కమెడియన్ గా పరిచయం అయిన అవసరాల శ్రీనివాస్ తర్వాత దర్శకుడిగా మారారు.   ఆయన తెరకెక్కించిన సినిమా ‘ఊహలు గుసగుసలాడే’.  ఈ మూవితో నాగశౌర్య హీరోగా పరిచయం అయ్యారు.  రాశీ ఖన్నా కూడా ఇదే మూవీతో తొలి పరిచయం అయ్యింది.  అయితే కెరీర్ బిగినింగ్ లో ఈ చిన్నది కాస్త బొద్దుగా ఉండటంతో  ఆశించినంత ఛాన్సులు రాలేదు.  అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈమెకు అవకాశాలకు దొరకడం అప్పట్లో కష్టమే అయ్యింది.  రాశీఖన్నా నటి మాత్రమే కాదు మంచి సింగర్.  సాయి ధరమ్ తేజ్  నటించిన సుప్రీమ్ సినిమాతో ఈ అమ్మడికి బాగా కలిసి వచ్చింది.

 

తర్వాత వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ మంచి విజయం అందుకుంది.  ఇటీవలే బాగా సన్నబడి నాజూకు అందాలతో యువతను తన వైపు  తిప్పుకుంటుంది.   గత ఏడాది విడుదలైన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే మంచి విజయాలు అందుంది.  ఆ మద్య విశాల్ నటించిన అయోగ్య మూవీలో విశాల్ సరసన నటించింది.  తమిళ నాట ఈ మూవీ మంచి విజయం అందుకుంది.  తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తుంది రాశీఖన్నా.  తాజాగా విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ   ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

 

నిన్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ అయినపుడు బెడ్ రూమ్ సీన్లు, ముద్దు సీన్ల పై చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి అభిప్రాయం తప్పకుండా మారుతుందని అన్నారు. టీజర్ చూసాక కథ విషయంలో ఏవేవో అంచనాలు పెట్టుకున్నారు. అయితే అంచనాలకు భిన్నంగా సాగుతుందీ మూవీ. తన కెరీర్ లో కథ పరంగా ఇదే బెస్ట్ సినిమా అని తేల్చి చెప్పేసింది రాశి. 

మరింత సమాచారం తెలుసుకోండి: