మాస్ హీరోలు ఎలా ఉంటారో పూరి సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. ఆయన సినిమాలో హీరోలు ఎలాంటి బట్టలు వేసుకుంటే అలాంటి బట్టలు బయట జనాలు ముఖ్యంగా కుర్రాళ్ళు అలాంటి బట్టలే వేసుకొని తిరగడం అలాగే సినిమాలో హీరో ఎలాంటి హేయిర్ స్టైల్ లో కనిపిస్తే బహట యూత్ కూడా అలాంటి హేయిర్ స్టైల్ మేయిన్‌టైన్ చేస్తుంటారు. ఒక రకంగా పూరి యూత్ ని చాలా మార్చేశారు. మొన్నటికి మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కూడా బయట యూత్ ని పూరి చాలా ప్రభావితం చేశాడు. ఒకప్పుడు జుట్టు గడ్డిలాగా పెంచుకుంటే ఫ్యాషన్. ఆ తర్వాత డిప్ప కటింగ్ తో అరగుండు చేసుకుంటే ఫ్యాషన్. చక్కగా పెళ్ళి కొడుకులా పక్క పాపటి తీసుకొని టక్ చేసుకొని పద్దతిగా బయట కనిపించేవాళ్ళు చాలా తక్కువ.

 

అయితే చాలా రోజుల తర్వాత అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ వెనక కాస్త జుట్టు పెంచి న్యూ లుక్ లో మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిని ఆకట్టుకున్నాడు. ఒకప్పుడు చిరంజీవి తన సినిమాలలో ఇలానే కనిపించారు. ఆ స్టైల్ ని మళ్ళీ ఇప్పుడు బన్ని గుర్తు చేశాడు. బన్నీకి అది బాగానే సెట్ అయింది కూడా. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా ఇలాగే లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నాడని తాజాగా రిలీజైన ఫొటోలు చూస్తుంటే తెలుస్తోంది.

 

క్రిష్ తెరకెక్కించబోయో సినిమాలో పవన్ కళ్యాణ్ ఇలా పెరిగిన జుట్టుతోనే కనిపించబోతున్నాడని తాజా సమాచారం. గడ్డం తీసేసి పెద్ద మీసాలతో, జుట్టు మాత్రం ట్రిమ్ చేయకుండా పార్టీ మీటింగ్ కు హాజరయ్యాడు. గడ్డం తీసేశాక వయసు పెరిగిన ఛాయలు కనిపిస్తున్నాయి కానీ, ముందున్న గ్లామర్, గ్రేస్ మాత్రం పవన్ లో ఏమాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన తొలిప్రేమ, బద్రి, ఖుషి.. సినిమాల టైమ్ లో తన హెయిర్ స్టైల్ కి లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఆ హెయిర్ స్టైల్ ని అలా ఫాలో అయ్యారు కూడా. ఆ తర్వాత కొమరంపులి, కాటమరాయుడు టైమ్ లో అప్పుడప్పుడు కాస్త వేరియేషన్ చూపించినా ఏదీ పెద్దగా క్లిక్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ తన స్టయిల్ ని చూపించారు. తాజాగా తెరమీదకొస్తున్న పింక్ రీమేక్, క్రిష్ సినిమాల తర్వాత అందరూ పవన్ స్టైల్ నే ఫాలో అవుతానిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: