విషయం ఏదైనా సరే వివరణ ఇచ్చే సిని పెద్దల్లో దర్శక నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ ఒకరు. ఈమధ్య ఆయన కొత్తగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టేసి సిని రాజకీయ విశ్లేషణలు చేస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతి సినిమాల మధ్య గొడవ గురించి తన మార్క్ సెటైరికల్ పంచులేసిన తమ్మా రెడ్డి భరధ్వాజ మళ్లీ చిరంజీవి మీద గాలి మళ్లినట్టు ఉంది.. అందుకే మళ్లీ చిరు మీద ఫోకస్ షిఫ్ట్ చేశారు. చిరంజీవికి నంది అవార్డ్ చైర్మన్ పదవి ఇస్తున్నారన్న వార్తలపై స్పందించిన తమ్మా రెడ్డి చిరు అందుకు అనర్హుడని అన్నారు.

 

నంది అవార్డ్ కమీ చైర్మన్ పదవి చిరంజీవికి ఇవ్వడం కరెక్ట్ కాదని దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని అంటున్నారు తమ్మారెడ్డి. చిరంజీవి ఉన్న స్థాయికి నంది అవార్డ్ చైర్మన్ పదవి సరిపోదని.. కమిటీ చైర్మన్ గా అవార్డులు ప్రకటిస్తే గొడవలు జరిగితే అప్పుడు ఆయన పరువు పోతుందని అన్నారు. పనిపాటా లేనోళ్లకు ఇచ్చే ఈ పదవికి చిరంజీవిని ఎంచుకోవడం కరెక్ట్ కాదని తమ్మా రెడ్డి అంటున్నారు. కాదు కూడదు అని చిరంజీవికి ఇస్తే గొడవపడైనా సరే ఆయన్ను ఆ పదవి నుండి తీయిచేస్తానని అన్నారు.

 

మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ రీసెంట్ గా చిరంజీవిని కలవడం ముఖ్య ఉద్దేశం అదే అని.. చిరుని చైర్మన్ గా చేసే ఉద్దేశంలో ఉన్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. అయితే చిరుపై తనకు చెప్పలేనంత అభిమానం ఉంది అన్నట్టుగా చెప్పే తమ్మా రెడ్డి ఎప్పుడు చిరుని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. చిరు స్థాయికి ఇదేం సరిపోదని ఖండించే తమ్మా రెడ్డి చిరు మీద ప్రేమ చూపిస్తున్నాడా లేక అక్కసుతో ఉన్నాడా అన్నది ఆలోచించడం ప్రేక్షకుల వంతు అయ్యింది. అయితే చిరుపై తమ్మారెడ్డి ఇలా వంకర తింకరగా మాట్లాడటం మొదటిసారి కాదు కాబట్టి ఆయన కామెంట్స్ ను లైట్ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: